మహమ్మారి పొంచి ఉన్నా మొద్దునిరద్రే..
అనంతపురం మెడికల్: కోవిడ్ మహమ్మారి వేల మందిని బలి తీసుకుంది. అందుకే కోవిడ్ పేరు వింటే ఇప్పటికీ హడలెత్తి పోతారు. ఇటీవల అదే కోవకు చెందిన మరో వైరస్ కలవరపెడుతోంది. ఉమ్మడి జిల్లాకు సమీపంలోని బెంగళూరులో పంజావిసిరింది. దీంతో దేశమే ఉలిక్కి పడింది. ఇంత జరుగుతున్నా ఉమ్మడి జిల్లా యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు.
వందలాది మంది రాకపోకలు..
చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఈ మహమ్మారి జాడలు బెంగళూరులో కన్పించాయి. ఇద్దరు శిశువుల్లో హెచ్‌ఎంపీవీ వైరస్ ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉమ్మడి జిల్లా నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి మన జిల్లాకు రోజూ వేలాది మంది ప్రయాణిస్తుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారు సైతం ఉమ్మడి జిల్లా మీదుగానే బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఉమ్మజి జిల్లాపై వైరస్ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆరోగ్యశాఖాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సర్వజనాస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అటువంటి చర్యలేమీ తీసుకోలేదు.
లక్షణాలు ఇలా..
కోవిడ్ 19 ఫ్లూ. శ్వాసకోశ రుగ్మతలను కలిగిస్తుంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి తదితర లక్షణాలుంటాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో బ్రాంౖకైటీస్, నిమోనియాకు దారితీస్తుంది. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ.
బెంగళూరులో ‘హెచ్‌ఎంపీవీ’ కలకలం
ఇద్దరు శిశువులకు వైరస్ నిర్ధారణ
ముందస్తు చర్యలు తీసుకోవడంలో
ఆరోగ్యశాఖాధికారుల విఫలం
Comments
Please login to add a commentAdd a comment