సోమవారం తెల్లవారుజామున పుట్టపర్తి సమీపంలో జాతీయ రహదారిప
● ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు
● గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి
● జాతీయ రహదారులపై కష్టంగా మారిన ప్రయాణం
● వాహనాన్ని రోడ్డుపై నిలిపినా ప్రమాదమే!
● ఉదయం 9 గంటల వరకు రాకపోకలకు తప్పని తిప్పలు
సాక్షి, పుట్టపర్తి
వాతావరణంలో మార్పులతో నాలుగైదు రోజులుగా దట్టమైన పొగమంచు జిల్లాను కమ్మేస్తోంది. ఉదయం 9 గంటల వరకూ భానుడినీ బంధించేస్తోంది. ఫలితంగా ఎదురుగా ఏముందో కూడా తెలియని పరిస్థితి తలెత్తుతోంది. ఈ క్రమంలోనే జాతీయ రహదారిపై ప్రయాణించే డ్రైవర్లు రోడ్డు సరిగా కనిపించక ఆగి ఉన్న వాహనాలు, రోడ్డు పక్కనే ఉన్న చెట్లను ఢీకొడుతున్నారు. పొగమంచు వల్ల ప్రయాణం ప్రమాదం అని తెలిసినా...కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయమే ప్రయాణించాల్సిన పరిస్థితి.
జాతీయ రహదారిపైనే ప్రమాదాలు..
జాతీయ రహదారులపై మంచు ప్రభావం అంచనా వేయలేం. ఏ ప్రాంతంలో ఎంత ప్రభావం ఉందనేది ఎవరూ అంచనా వేయలేరు. ఉన్నఫలంగా ముందున్న అద్దాన్ని పొగమంచు కమ్మేయడంతో రోడ్డు కానరాదు. ఫలితంగా కొందరు వాహనం రోడ్డు పక్కన ఆపి సేద తీరుతారు. అయితే ఇంకొందరు సుదూర ప్రాంతాల నుంచి వేగంగా వచ్చి టక్కున ఆపలేక ఆగి ఉన్న వాహనాలను ఢీకొడుతున్నారు. పొగమంచుతో ముందు ఉన్న వాహనం కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు.
వాహనాలు కనిపించక...
రవాణా శాఖ లెక్కల ప్రకారం రోజూ తెల్లవారుజామున నుంచి ఉదయం 8 గంటలల్లోపు ఇరుగు, పొరుగు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేసే 2 వేల వాహనాలు జిల్లాలోని జాతీయ రహదారి గుండా వెళ్తుంటాయి. పొగమంచు పెరిగినప్పుడు కొందరు ముందు జాగ్రత్తగా జాతీయ రహదారిలోని పార్కింగ్ ప్రదేశంలో వాహనం నిలుపుతూ ఉంటారు. అవగాహన లేని డ్రైవర్లు కొందరు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుతున్నారు. ఇంకొన్ని చోట్ల పార్కింగ్ సమస్య కారణంగా రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులకు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనల్లో ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అప్రమత్తత అవసరం
పొగమంచుతో ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించడం లేదు. అందువల్ల ఆ సమయంలో ప్రయాణాలు సరికాదు. రాత్రి వేళ రోడ్ల్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపరాదు.
– ఎన్‌ఎన్ కరుణసాగర్‌రెడ్డి, జిల్లా రవాణా అధికారి,
Comments
Please login to add a commentAdd a comment