లేపాక్షి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ికర్ణాటకలోని జీలగుంట గ్రామానికి చెందిన వెంకటేష్(45) వ్యక్తిగత పనిపై హిందూపురానికి శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. లేపాక్షి మండలం వెంకటాపురం క్రాస్ వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహన వేగాన్ని నియంత్రించుకోలేక అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం అటుగా వెళుతున్న వారు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడి ఆచూకీని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.
మద్యం మానేయమంటే..
ప్రాణాలు తీసుకున్నాడు!
కంబదూరు: మద్యం మానేయడం ఇష్టంలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం ఓబగానిపల్లికి చెందిన రాజన్న (29) మొదటి భార్య మృతి చెందింది. దీంతో 30 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిస కావడంతో రోజూ తప్పతాగి ఇంటికి చేరుకునేవాడు. శనివారం రాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో తల్లి నాగమణి, భార్య చైత్ర మందలించారు. రోజూ మద్యం తాగుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, ఏదైనా పని చేసుకుంటూ గౌరవంగా బతుకుదామని హితవు పలికారు. అయితే మద్యానికి పూర్తి స్థాయిలో బానిసైన రాజన్న... అదే రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇంట్లో వారు గమనించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ప్రవీన్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
రెవెన్యూ ఉద్యోగుల స్పోర్ట్, కల్చరల్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: రెవెన్యూ ఉద్యోగుల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం అనంతపురంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గౌని సంజీవరెడ్డి, కార్యదర్శిగా పుట్లూరు హరిప్రసాదరెడ్డి, కోశాధికారిగా కె.శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షులుగా టి.హరిప్రసాద్, చంద్రరేఖ, పి.మూర్తి, ప్రసాదరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా పి.నారాయణస్వామి, ఎస్.షాహిద్ అక్రమ్, డి.భరత్ ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment