●చూడచక్కని కోట
ఎత్తయిన రాతి గోడలతో శత్రుదుర్బేధ్యంగా నిలిచిన గుత్తి కోట
రాచరిక దర్పాన్ని చూడాలనుకుంటే సీమ దుర్గాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన గుత్తి దుర్గాన్ని తప్పక సందర్శించాలి. ఈ కోటలోని ప్రతి అణువుకూ ఓ చరిత్ర ఉంది. ఆసక్తిగా చూస్తే ప్రతిదీ అద్భుతంగానే కనిపిస్తుంది. అక్కడున్న శాసనాలను బట్టి క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మితమైన ఈ కోట శత్రుదుర్బేధ్యంగా ఖ్యాతిగాంచింది. కోట శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత కనుచూపు మేర కనిపించే ఎత్తయిన రాతి గోడలు ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ను మరిపిస్తాయి. ప్రకృతి రమణీయమైన అందాలతో చూపరుల మనస్సు దోచేస్తున్న కోటలో 101 బావులు, 15 బురుజులు, 15 ముఖద్వారాలు, గజశాలలు,
గుర్రపు శాలలు, చీకటి గదులు, దర్బార్ మంటపం, సొరంగాలు ఇలా అనేకం ఉన్నాయి. మరాఠులు, విజయనగర రాజులు, చాళుక్యులు, చోళులు ఇలా 22 రాజ వంశాలు పాలించాయి. ఎప్పుడన్నా కుటుంబంతో సహా బయటకు వెళ్లాలంటే అందమైన.. చూడచక్కని.. చూడక తప్పని ప్రదేశాల్లో ఒక్కటిగా ఉన్న గుత్తి కోటను సందర్శిస్తే మనతో పాటు చిన్నారుల మేథో విజ్ఞాన వికాసానికి బాటలు వేసినట్లవుతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:
Comments
Please login to add a commentAdd a comment