మూడు నెలల్లో రహదారి ఏర్పాటు
ముదిగుబ్బ: మండల పరిధిలోని జొన్నలకొత్తపల్లి తండాకు మూడు నెలల్లో రహదారిని ఏర్పాటు చేస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతు హుస్సేన్ తెలిపారు. మంగళవారం ఆయన జొన్నలకొత్తపల్లి తండాను సందర్శించారు. దారి సౌకర్యం లేక తండావాసులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 17న ‘ఊరు ఉంది..దారి లేదు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు...తండాకు రహదారి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నారాయణస్వామితో కలిసి తండావాసులతో సమావేశమయ్యారు. తండా వాసుల సమస్యలు తెలుసుకున్నారు. మూడు నెలల్లో తండాకు రహదారిని ఏర్పాటు చేయడంతో పాటు ఇతర సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.
‘సాక్షి’ కథనానికి స్పందించిన
ఎస్టీ కమిషన్ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment