24న ప్రాథమిక విద్య కమిషనర్ రాక
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఈనెల 24న జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న పంచాయతీ మోడల్ ప్రైమరీ పాఠశాలల విధానంపై సమీక్షించనున్నారు. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక పంగల్‌రోడ్డులోని ఆర్డీటీ అంధ విద్యార్థుల పాఠశాలలోని ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లాలోని మండల వి ద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రసాద్‌బాబు, కిష్టప్ప, సమగ్ర శిక్ష ఏపీసీలు శైలజ, దేవరాజు, డీసీఈబీ కార్యదర్శులు గంధం శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, డీవైఈఓలు శ్రీనివాసరావు, శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓలు మాట్లాడుతూ కమిషనర్ నిర్వహించే సమీక్షకు అన్ని వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. ముఖ్యంగా పంచాయతీ మోడల్ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి అన్ని వివరాలు ఉండాలన్నారు. పూర్తిగా అవగాహన కల్గి ఉండాలని సూచించారు. కమిషనర్ ర్యాండమ్‌గా స్కూళ్ల గురించి ఆరా తీస్తారన్నారు. ఉమ్మడి జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల హెచ్‌ఎంలు, సీఆర్టీలు తప్పకుండా హాజరుకావాలని సూచించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా జీఎం శేఖర్
పుట్టపర్తి టౌన్: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా జీఎం శేఖర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, జాతీయ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానానికి ఎన్నికలు నిర్వహించగా, జీఎం శేఖర్ విజయం సాధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు శాలువాలు, పూల బొకేలతో శేఖర్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, కొండమరాజు, జ్యోతి ప్రసాద్, సురేంద్రబాబు, సునీల్ వైట్ల, బాలగంగాధర్, రామాంజనేయలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment