కాలు, చేయి విరిచేశారు!
చిలమత్తూరు: టీడీపీ నేతల దౌర్జన్యాలు, దుర్మార్గాలకు అంతేలేకుండా పోతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రశ్నించడమే పాపమై పోతోంది. రౌడీల్లా మారిన టీడీపీ నేతలు సామాన్యులపై భౌతికదాడులు చేస్తూ అరాచకాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ సామాన్యుడిపై దాడి చేసి కాలు, చేయి విరిచేశారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా మంగళవారం చిలమత్తూరు మండలంలోని దేమకేతేపల్లి గ్రామంలో టీడీపీ నేతలు ఇష్టానుసారం బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికుడు నరసింహ ఇలా రోడ్డుకు అడ్డంగా బ్యానర్లు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేత అంజినప్ప, ఆయన కుమారుడు వేణు, గొల్ల సత్యంతో పాటు మరికొందరు దాడికి దిగారు. నరసింహపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈఘటనలో నరసింహ కుడి కాలు, ఎడమ చేయి విరగడంతో బంధువులు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గతంలోనూ దాడులు..
గతేడాది ఆగస్ట్‌లో దేమకేతేపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు గోపాలప్ప, ఆయన భార్య శాంతమ్మలపై కూడా టీడీపీ నాయకుడు అంజినప్ప, ఆయన కుమారుడు కొడవళ్లతో దాడి చేసి గాయ పరిచారు. అధికారం అండతో బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి వేధించారు.
బ్యానర్ అడ్డంగా ఎందుకు కట్టారని ప్రశ్నించిన సామాన్యుడు
రెచ్చిపోయి కర్రలతో దాడి చేసిన
టీడీపీ నాయకులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు నరసింహ
Comments
Please login to add a commentAdd a comment