పర్యాటక అభివృద్ధికి చర్యలు
ప్రశాంతి నిలయం: జిల్లా అధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి చర్యలు చేపట్టామని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. మంగళవారం ఆయన.. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో టెంపుల్ టూరిజం సర్క్యూట్‌పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అవసరమైన చోట పర్యాటక ప్రాజెక్టుల కోసం భూమిని గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. లేపాక్షిలో అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని, ఓపెన్ ఆడిటోరియం నిర్మాణం పనులకు ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే లేపాక్షి ఆలయం జఠాయువు థీమ్ పార్క్ ఫుడ్ కోర్ట్, స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించాలని సూచించారు. గొల్లపల్లి రిజర్వాయర్ బోటింగ్‌కు తగు చర్యలు తీసుకోవాలన్నారు. తనకల్లు మండలంలోని కోటపల్లి గ్రామంలో పీపీపీ పద్ధతి నిర్మిస్తున్న రేస్ ట్రాక్, థీమ్డ్ లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్ట్ స్థితిపై అధ్యయనం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్ బాబు, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి, పురావస్తు శాఖ ఏడి రజిత, దేవదాయ శాఖ ప్రతినిధి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
Comments
Please login to add a commentAdd a comment