నిలకడగా ఎండు మిర్చి ధరలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. మంగళవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు 131.80 క్వింటాళ్ల ఎండు మిర్చి రాగా, అధికారులు ఈ నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో మొదటి రకం ఎండు మిర్చి క్వింటా రూ.16,500, రెండో రకం క్వింటా రూ.9 వేలు, మూడో రకం ఎండుమిర్చి క్వింటా రూ.7 వేల ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌కు నాణ్యమైన మిర్చి తీసుకువచ్చి మంచి ధరలు పొందాలని రైతులకు ఆయన సూచించారు.
బాలయ్య.. రాలేమయ్యా
● ఎమ్మెల్యే పర్యటనలో కనిపించని ప్రజా స్పందన
చిలమత్తూరు: బాలకృష్ణ హవా తగ్గుతోందా...జనం ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదా.. నియోజకవర్గంలో నానాటికీ గ్రాఫ్ పడిపోతోందా...కార్యకర్తలు కూడా దూరమవుతున్నారా.. మంగళవారం కనిపించిన పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. గతంలో ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చినా... ప్రజల్లో కాస్తో కూస్తో స్పందన ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మంగళవారం ఎమ్మెల్యే బాలకృష్ణ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనగా జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. బ్రహ్మేశ్వరంపల్లి గ్రామంలో మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి బాలకృష్ణ అట్టహాసంగా వెళ్లినా స్థానికులు పత్తాలేకుండా పోయారు. బాలకృష్ణ గ్రామానికి వస్తున్నారని ముందురోజే ప్రచారం చేసినా... కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామస్తులెందుకో ఆసక్తి చూపించలేదు. అయితే మండలంలోని ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు హాజరుకావడంతో టీడీపీ ముఖ్య నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment