గత ఏడాది జిల్లాలో ఇలా..
సాక్షి, పుట్టపర్తి: ప్రేమలో పడితే లోకాన్ని మరిచిపోతున్నారు. కన్న తల్లిదండ్రులను దూరం చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. పాతికేళ్లు పోషించిన వారిని వదిలి అప్పుడప్పుడే మదిలోకొచ్చిన మనిషిపై మోజు పడుతున్నారు. సినిమాల ప్రభావంతో చాలా మంది యువత ప్రేమ బాట పట్టారు. రాత్రింబవళ్లూ స్మార్ట్ ఫోన్లలో ముచ్చటిస్తూ పంచాయితీని తల్లిదండ్రుల ముందు ఉంచుతున్నారు. అంగీకరిస్తే పెళ్లి.. లేదంటే ప్రేమ పెళ్లి. అనంతరం రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించడం.. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. ప్రతి వారం ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి పంచాయితీలు వెలుగు చూస్తున్నాయి. 2024 ఏడాది ఆరంభం నుంచి డిసెంబరు 31 వరకూ జిల్లా పోలీసు కార్యాలయానికి రక్షణ కోరుతూ 27 విన
తులు వచ్చాయి. బంధువుల నుంచి రక్షణ కల్పించాలని .. తమ బతుకు తమను బతుక్కోనివ్వండి అంటూ ఘాటుగా మాట్లాడుతున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు.
అంతా బిల్డప్.. తర్వాత కటీఫ్
అవతలి వ్యక్తి మనసు దోచుకోవాలనే ఉద్దేశంతో కొందరు లేనిపోని బిల్డప్ మాటలు చెబుతారు. హైఫై లైఫ్ గురించి సంభాషణ మొదలుపెడతారు. రంగు రంగుల దుస్తులతో అలరిస్తారు. అయితే పెళ్లయిన తర్వాత అలాంటివేవీ వారికి కనిపించవు. ఫలితంగా అంతా బిల్డప్ అని తెలుసుకుని తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడలేక తిరిగి బంధువుల చెంతకు చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రేమ పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై పంచాయితీలు జరిగి.. స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.
సక్సెస్ రేట్ అంతంతే..
చాలా మంది యువతీ యువకులు సినిమాల ప్రభావంతోనే ప్రేమలో పడుతున్నారు. సినిమాల్లో కథానాయక, నాయికల స్థానాల్లో తామే ఉన్నామనే భావనలోకి వెళ్లి.. ఊహల్లో తేలియాడుతున్నారు. ప్రేమపెళ్లిని పెద్దలు అంగీకరిస్తే ఆనందంగా గడిపేస్తున్నారు. అంగీకారం లేకున్నా.. రహస్యంగా పెళ్లి చేసుకున్న వారిలో చాలా మంది విడిపోతున్నారు. ఆరు నెలలు తిరగకుండానే.. కలిసి ఉండలేమంటూ మళ్లీ పోలీస్‌స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. విడాకుల కోసం పిటిషన్ వేస్తున్న వారిలో సగం మందిపైగా ప్రేమ పెళ్లి చేసుకున్న వారే ఉండటం గమనార్హం.
రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు
విడాకుల కోసం కోర్టుకెక్కిన దంపతుల సంఖ్య
విడాకుల పిటిషన్లలో ప్రేమ వివాహాలు
శాతం
తల్లిదండ్రుల బాటలో నడవండి
పిల్లలపై తల్లిదండ్రుల నిఘా అవసరం. మొబైల్ ద్వారా ఏం చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టాలి. ప్రేమలో పడిన తర్వాత బయటికి లాగడం చాలా కష్టం. వయసుకు వచ్చాక పెళ్లి చేసుకుంటారు. మేజర్లు కావడంతో చట్టం కూడా అంగీకరిస్తుంది. అయితే ప్రేమ వివాహాల కారణంగా గొడవలు చేసుకోకూడదు. పరువు కోసం ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదు. ప్రేమ వివాహాలు ఎక్కువ జరిగేందుకు సినిమాల ప్రభావమే ప్రధాన కారణమని చెప్పవచ్చు.
– వి.రత్న , ఎస్పీ
తలుపులలో నివాసం ఉంటున్న బీసీ కులానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామంలో అగ్రవర్ణంలోని అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసు ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఇద్దరి బంధువులను పిలిపించి సర్దిజెప్పి పంపించారు. ఎవరూ గొడవలకు దిగరాదని, మేజర్లు కావడంతో చట్టపరంగా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉందన్నారు.
కదిరికి చెందిన ఓ యువకుడు పులివెందులలోని ఓ ప్రైవేటు కాలేజీలో పని చేస్తున్నాడు. అయితే కదిరిలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోన్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కుల, మతాలు వేరు కావడంతో అమ్మాయి తరఫు వాళ్లు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఇంతలోనే ఓ యువకుడితో ఆ అమ్మాయికి పెళ్లిని ఖాయం చేశారు. అయితే ప్రేమించిన యువకుడితో ఆమె వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆ జంట పుట్టపర్తిలోని ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కోరింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్టాన్ని గౌరవించాలని పోలీసులు సూచించారు.
27
63
81
ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, ఫలితంగా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఎక్కువ మంది చెబుతున్నారు. అయితే తమ బంధువుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ పోలీసులను రక్షణ కోరుతున్నారు. జిల్లాలో గత ఏడాదిలో మొత్తం 27 జంటలు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించి రక్షణ కోరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment