● ఇస్తెమా ప్రారంభం
తాడిమర్రి: మండల కేంద్రమైన తాడిమర్రిలో ఇస్తెమా కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి తొలిరోజు వేలాదిగా ముస్లింలు తరలివచ్చారు. దీంతో తాడిమర్రి పరిసరాలు కిటకిటలాడాయి. వచ్చిన వారందరికీ నిర్వాహకులు భోజన వసతి కల్పించారు. అనంతరం ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక బోధనలు చేశారు. రెండోరోజైన సోమవారం సుమారు లక్ష మంది కార్యక్రమానికి హాజరుకానున్నట్లు మత పెద్దలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment