రాగిరి.. విధుల్లో కిరికిరి!
మడకశిర: ఆ పోలీసు అధికారి తన ప్రవర్తన తీరుతో తరచూ వార్తల్లోకెక్కుతుంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తూట్లు పొడవడం.. ఫిర్యాదుదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం.. సివిల్ వివాదాల్లో తలదూర్చడం.. న్యాయాన్యాయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరించడంతో పోలీసు శాఖలో వివాదాస్పద అధికారిగా ఘనతికెక్కారు. ఆయనెవరో కాదు మడకశిర అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ రాగిరి రామయ్య. గత ఏడాది డిసెంబర్‌లో ఇక్కడ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ప్రారంభం నుంచే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉంది. అధికార టీడీపీలో ఓ వర్గానికి వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎల్లోటి గ్రామంలో జరిగిన ఓ ఘటనలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ఆదినారాయణపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించారు. ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఈరన్న వర్గీయులు కూడా పోలీస్ ఉన్నతాధికారులకు, పార్టీ పెద్దలకు సీఐపై ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా పోలీస్‌స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే వారిపై కూడా దురుసుగా, అమర్యాదగా మాట్లాడుతుండడం మరింత వివాదానికి కారణమైంది. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ గిరిజన మహిళతో సీఐ అసభ్యకరంగా మాట్లాడారు. బాధితురాలు ఎస్పీ రత్నను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీల పరిశీలనలో బాధితురాలి ఆరోపణలు నిజమని తేలింది. దీంతో సీఐ రాగిరి రామయ్యను శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన వీఆర్‌కు పంపారు. విచారణ నివేదిక వచ్చాక సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు సీఐపై ఫిర్యాదులు చేశారు. ఇందులో ఓ హిజ్రా కూడా సీఐపై ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఆ సీఐ తీరు ఆదినుంచి
వివాదాస్పదమే
Comments
Please login to add a commentAdd a comment