కమనీయం.. కల్యాణోత్సవం
హిందూపురం అర్బన్: పట్టణంలోని మెయిన్‌బజార్‌లో పేట వేంకటరమణస్వామి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. మంగళవారం ఉదయం నుంచి వేద పండితులు స్వామి వారికి సుప్రభాతం, తిరుమంజన సేవ, ప్రాకారోత్సవం నిర్వహించారు. పట్టణ మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులు మోసుకొచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శ్రీదేవి, భూదేవి సమేత పేట వేంకటరమణుని కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
నేడు బ్రహ్మరథోత్సవం..
పేట వేంకటరమణుని బ్రహ్మరథోత్సవం బుధవారం నిర్వహించనున్నారు. ఇందు కోసం దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment