![తెరిచి ఉన్న బీరువా
- Sakshi](/styles/webp/s3/article_images/2024/03/14/13nnp06-280013_mr_0.jpg.webp?itok=QvF4gcQF)
తెరిచి ఉన్న బీరువా
నరసన్నపేట: మండలంలోని జమ్ము కూడలిలో రైసు మిల్లుల్లో మంగళవారం రాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. వరుసగా మూడు మిల్లులతో పాటు ఒక విస్తరాకుల పరిశ్రమలో చోరీలకు ప్రయత్నించారు. బీరువాలు తెరిచి డబ్బుల కోసం వెతికారు. అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్‌లను ఎత్తుకుపోయారు. జమ్ము కూడలి వద్ద శాంతా రామా, శాంతామణి, లక్ష్మి నాగేశ్వరా రైస్ మిల్లులతో పాటు పక్కనే ఉన్న విస్తరాకుల తయారీ పరిశ్రమలో కూడా చోరీకి ప్రయత్నించారు. మిల్లుల వద్ద ఉన్న నైట్ వాచ్‌మేన్లను చంపుతామని కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ చోరీల్లో 10 నుంచి 16 మంది వరకు పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు మిల్లులను పరిశీలించారు. కాగా చోరీలకు సంబంధించి రైస్‌మిల్లర్లు ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment