No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, May 6 2024 4:30 AM

No Headline

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీలో చేరికల సందడి నెలకొంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు స్థానిక ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ మరోసారి గెలుపు ఖాయంగా కనిపిస్తుండటంతో టీడీపీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీసీ నినాదం జోరుగా సాగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మరోసారి వైఎస్సార్‌ సీపీ తరఫున ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున నడుకుదిటి ఈశ్వరరావు బరిలోకి దిగారు. ఈయన కమ్మ సామాజకవర్గానికి చెందిన వారు. దీంతో నియోజకవర్గంలో 80 శాతం పైగా ఉన్న బీసీలు వైఎస్సార్‌ పార్టీ అభ్యర్థివైపే అనుకూలంగా ఉన్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు పోటీ చేస్తున్న టీడీపీ గుర్తు ఈ ఎన్నికల్లో కనిపించకపోవటం సైతం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ సీపీ బలపడుతోంది.

ఇటీవల చేరికలు..

● రణస్థలం ఎంపీటీసీ సభ్యురాలు మజ్జి గౌరి, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు రామారావు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అరిణాంఅక్కివలస సిద్ధం యాత్రలో భాగంగా వీరికి కండువా వేసి ఆహ్వానించారు.

● రణస్థలం మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు గొర్లె విజయ్‌కుమార్‌ కూడా సీఎం సమక్షంలో వైఎస్సార్‌ సీపీ చేరారు.

● రణస్థలం మండలం పాతర్లపల్లిలో టీడీపీ నుంచి 24 కుటుంబాల వారు వైఎస్సార్‌ సీపీలో చేరారు. గొర్లె శంకరరావు, చిత్రి ఈశ్వరరావులతో కూడిన నాయకుల బృందానికి ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌ కండువాలు వేసి ఆహ్వానించారు.

● లావేరు మండలం తామాడ పంచాయతీలో మునకాల రాంబాలు ఆధ్వర్యంలో 50 టీడీపీ కుటంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి.

● రణస్థలం మండలం అల్లివలసలో జనసేన పార్టీ నుంచి దుమ్ము సత్తిపిల్ల, గురువులతో కూడిన 20 కుటుంబాల వారు వైఎస్సార్‌ సీపీలో చేరారు.

● రణస్ధలం మండలం మరువాడ పంచాయతీలో సూర్యనారాయణ, అప్పన్నలతో సహా 10 టీడీపీ కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీ కండువాలు ధరించారు.

● రణస్థలం మండలం అర్జునవలస పంచాయతీ గిరినివానిపాలెంలో గుడ్డాల తవుడు, ఆల్లి గౌరునాయుడులతో పాటు 60 టీడీపీ, జనసేన కుటుంబాలు పార్టీలో చేరాయి.

● లావేరు మండలం అప్పాపురంలో పతివాడ గోవింద, మంగిశెట్టి సంతోష్‌లతో పాటు 15 కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి.

● ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ అఖింఖాన్‌పేటలో 60 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. బస్వ గురయ్యరెడ్డి, టి.మాధవరావు లాంటి సీనియర్‌ నాయకులకు ఎమ్మెల్యే కిరణ్‌ కండువాలు వేసి ఆహ్వానించారు.

● ఎచ్చెర్ల మండలం పూడివలస, తమ్మినాయుడుపేటలో కంచి అప్పన్న, నక్కన శ్రీనులతో పాటు పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

Advertisement
Advertisement