నాటి జ్ఞాపకాలు ఇవే...
శ్రీకాకుళం కల్చరల్:
ఇప్పుడు కాదు గానీ.. ఓ నలభై ఏళ్ల కిందట శ్రీకాకుళం ఎలా ఉండేదో తెలుసా..? పెద్ద పల్లెటూరులా ఉండేది. ఏడురోడ్ల కూడలి, సూర్య మహల్ కూడలి, ఇల్లీసుపురం, అరసవల్లి కూడలి వద్ద పసగాడ సూర్యనారాయణ మిల్లు కూడలి, పాతబస్టాండు, పందుంపుల్ల కూడలి, పాతశ్రీకాకుళం, గుజరాతీపేట సెంటర్లలోనే జనం తిరిగేవారు. అప్పట్లో సైకిల్, మూడు చక్రాల రిక్షాలు మాత్రమే ప్రయాణ సాధనాలు. ఒకటి కాదు రెండు కాదు అప్పట్లో వందల్లో నగరంలో రిక్షాలు తిరిగేవంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరుకున్నాయి. అందులో గూడు రిక్షాలు నడిపేవారు అంతా కలిపి 50వరకే మిగిలారు.
అదో హుందా..
ఒకప్పుడు రిక్షా ప్రయాణం హుందాతనానికి గుర్తు. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి తేవడం, ఆఫీ సులకు వెళ్లే వాళ్లు, జిల్లా కోర్టుకు వెళ్లడానికి లాయ ర్లు, కొంతమంది ప్రముఖులు కాఫీ తాగేందుకు హోటల్‌కు, సినిమాలకు వెళ్లడానికి ఎక్కువగా వాడేవారు. ప్రతి రోజూ వెళ్లే వారు ప్రత్యేకంగా ఒక రిక్షాను వారు రోజు వెళ్లే అదే సమయానికి రమ్మని చెప్పి వెళ్లడం పరిపాటి. రెండో ఆట సిని మా హాలుకు వెళ్లే వారి కోసం సినిమా వదిలిన వెంటనే అక్కడ అధిక సంఖ్యలో రిక్షాలు రెడీగా ఉండేవి.
తగ్గిన వినియోగం..
మోటారు వాహనాల రాకతో రిక్షాలన్నీ మూలకు చేరిపోయాయి. 40 ఏళ్ల క్రితం నాటి వాళ్లే ఇంకా రిక్షాను తొక్కుతూ చాలీచాలని సంపాదనతో జీవితాలను గడుపుతున్నారు. కొంతమంది ఇప్పటికీ తమ పిల్లలను స్కూలుకు పంపేందుకు రిక్షాలను వాడుతున్నారు. గతంలో రిక్షా ద్వారా రూ.50 నుంచి రూ.70 వరకు సంపాదించేవారు. ప్రస్తుతం వారు రోజుకు రూ.150లు నుంచి రూ.400 వరకు సంపాదిస్తున్నారు.
మరుగున పడిన రిక్షా వాలా
బతుకంతా రిక్షా తొక్కిన శ్రామికులు
ఎదుగుబొదుగు లేని జీవితాలు
ప్రముఖ జ్యోతిషవేత్త మూగుల ప్రకాశం
రో జూ హోటల్‌కు రిక్షాపై వెళ్లి కాఫీ తాగి వచ్చేవారు. అలాగే ప్రముఖ లాయరు సోదరులు కొల్లూరు రామబ్రహ్మం, సుబ్రహణ్యంలు ఇద్దరు కలిసి కోర్డుకు రిక్షాపైన వెళ్లేవారు. పుణ్యపువీధిలో ఉండే ఆడిట్ ప్రాక్టీషనర్ సుమారుగా 40ఏళ్లుగా రిక్షాపైన రోజూ సాయంత్రం షికారుకు వెళ్లే వారు. కరోనా వచ్చిన తరువాత తగ్గించి, అప్పుడప్పుడు ఇప్పటికీ రిక్షాపై వెళుతుంటారు. అప్పటి కాలంలో కొందరు షావుకార్లు రిక్షా
కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చేవారు.
ఎప్పుడైనా ఆ షావుకారు ఎక్కడికై నా
వెళ్లాలంటే ఈ రిక్షాలో ఫ్రీగా వెళ్లేవారు.
అని రిక్షా కార్మికులు నాటి
జ్ఞాపకాలను
పంచుకున్నారు.
ట్రాలీ రిక్షాలతోనే..
రిక్షా తొక్కీ తొక్కీ చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు తమ బళ్లను ట్రాలీ బళ్లుగా మార్చుకున్నారు. ప్రస్తుతం దానిపైనే ఆదాయం వస్తోంది. షాపుల నుంచి సరుకులను బస్టాండుకు, బస్టాండు నుంచి షాపులకు ట్రాన్సుపోర్టు చేస్తున్నారు. దీంతో గిరాకీ బాగుంది. కానీ పరుగులు పెడుతున్న ఈ ప్రపంచంతో పోటీ పడలేక రిక్షా లాగే నెమ్మదిగా బతుకు బండిని లాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment