No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Oct 19 2024 1:02 AM | Last Updated on Sat, Oct 19 2024 1:02 AM

No Headline

శ్రీకాకుళం కార్పొరేషన్‌లో

తాడేపల్లి గూడెం వాసి హడావుడి

రంగుల కాంట్రాక్ట్‌ తనదేనంటూ తీర్మానం

టెండర్లు వేసిన కాంట్రాక్టర్లంతా తప్పుకోవాలని హుకుం

ఆ కాంట్రాక్టర్‌కు ఓ ఉన్నతాధికారి వత్తాసు

బెంబేలెత్తుతున్న అధికారులు..

వాస్తవంగా సెప్టెంబర్‌లో ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచారు. అదే నెల 15కల్లా టెండర్లు తెరవాలి. కానీ తాడేపల్లి గూడెం వాసి చేస్తున్న ఒత్తిళ్లు కారణంగా టెండర్లు తెరిచే ప్రయత్నమైనా అధికారులు చేయడం లేదు. ఓపెన్‌ చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని భయపడి వెనక్కి తగ్గిపోతున్నారు. సాంకేతిక కారణాలతో తెరవలేకపోయామని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. అమరావతి పెద్దలతో పాటు ఆయనకు పరిచయం ఉన్న ఓ ఉన్నతాధికారి జోక్యం చేసుకుంటుండటం వల్ల టెండర్ల జోలికి ఇక్కడ అధికారులు పోవడం లేదని తెలుస్తోంది.

‘నేను లోకేష్‌ మనిషిని. అమరావతి పెద్దల డైరెక్షన్‌ ఇది. నేను చెప్పేదే జరగాలి. కార్పొరేషన్‌లో రంగులు కాంట్రాక్ట్‌ నాదే. టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లంతా తప్పుకోవాలి. చెప్పింది చేయకపోతే ఇబ్బందులు పడతారు. తప్పుకోకపోతే మిగతా కాంట్రాక్ట్‌ పనులు దక్కనీయకుండా చేస్తాను. ఇది నా ఆదేశం. చెప్పినట్టు చేయండి’

– శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తాడేపల్లిగూడెం వాసి చేస్తున్న హడావుడి ఇది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.కోటికి పైగా నిధుల రంగులు వేసే కాంట్రాక్ట్‌ కోసం తాడేపల్లి గూడెం వాసి నానా యాగీ చేస్తున్నారు. తాను లోకేష్‌ మనిషినని చెప్పుకుంటూ బెదిరిస్తు న్నారు. పెద్దల డైరెక్షన్‌ మేరకు ఇప్పటికే రూ.25లక్షల పనులను నామినేటేడ్‌ పద్ధతిలో చేయగా, మరో రూ.78లక్షలకు పైగా విలువైన పనులను ఈ ప్రొ క్యూర్‌మెంట్‌ టెండర్లలో నేరుగా కొట్టేసేందుకు ప్లాన్‌ వేస్తున్నారు.

అడ్డగోలు వ్యవహారం..

జిల్లా కేంద్రంలో ఆగస్టు 15 పేరుతో ప్రభుత్వ పెద్ద ల సిఫార్సులతో ఇప్పటికే రూ.25లక్షల రంగుల పనులను నామినేటేడ్‌గా తీసుకుని చేసేశారు. మరో రూ.78.26 లక్షల విలువైన పనులను ఆన్‌లైన్‌లో కాంట్రాక్ట్‌లో ఏకపక్షంగా దక్కించుకునేందుకు పావు లు కదుపుతున్నారు. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు కావడంతో శ్రీకాకుళం నగరానికి చెందిన పలువురు కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేశారు. దీంతో టెండర్లలో పోటీ ఏర్పడింది. ఇవి తెరిస్తే తనకు కాంట్రా క్ట్‌ రాదేమోనని ఓ వ్యక్తి మిగతా కాంట్రాక్టర్లందరినీ తప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. తప్పుకోకపోతే ఇబ్బందులు పడతారని బెదిరింపులు కూడా దిగుతున్నారు. టెండర్లలో పాల్గొన్న కాంట్రాక్టర్లు తప్పు కోలేదని సెప్టెంబర్‌లో తెరవాల్సిన టెండర్లను నేటి వరకు తెరవకుండా అధికారం అండతో తాత్సారం చేయిస్తున్నారు. తాను తప్ప ఎవ్వరూ టెండర్లలో ఉండటానికి వీల్లేదని, తనకు తప్ప ఎవరికి రంగులు కాంట్రాక్ట్‌ ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పేస్తున్నారు. అంతటితో ఆగకుండా కాంట్రాక్ట్‌ తనకు దక్కకుండానే పనులు చేయాల్సిన చోట పాత రంగులపై తెల్ల రంగు వేసి, కాంట్రాక్ట్‌ వర్క్‌ను రిజర్వ్‌ చేసుకున్నానని హడావుడి చేస్తున్నారు.

రకరకాల జిమ్మిక్కులు

ఇటీవల కార్పొరేషన్‌ పరిధిలో మురుగు కాలువల షిల్ట్‌ తీసే పనులను చేపట్టారు. ఫేజ్‌–1, ఫేజ్‌–2 కింద పనులు చేపట్టారు. ఈ పనులు చేపట్టే కాంట్రాక్టర్లే రంగుల ఈప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లలో కూడా పాల్గొన్నారు. రంగుల టెండర్ల నుంచి సదరు స్థానిక కాంట్రాక్టర్లు తప్పుకోవడం లేదని షిల్ట్‌ పనులకు సంబంధించి ఎంబుక్‌లు రికార్డు చేయనివ్వకుండా తాడేపల్లిగూడెం వాసి అడ్డు తగులుతున్నారు. రంగుల కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకుంటేనే షిల్ట్‌ పనులకు సంబంధించి ఎంబుక్‌లు రికార్డులు చేస్తామని పరోక్షంగా బెదిరిస్తున్నారు. అమరావతి పెద్దల జోక్యం, ఓ ఉన్నతాధికారి సిఫార్సుల నేపథ్యంలో అటు షిల్ట్‌ పనులకు ఎంబుక్‌ రికార్డు చేయకుండా, అటు రంగుల టెండర్లు తెరవకుండా అధికారులు సైతం జాప్యం చేస్తున్నారు. మొత్తానికి ఈ ‘లోకేష్‌ మనిషి’ మున్ముందు కార్పొరేషన్‌లో షాడోగా వ్యవహరించి పెత్తనం చెలాయించే ప్రమాదం లేకపోలేదు.

అంతా తప్పుకోండిక..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement