మంత్రి ఇలాకాలో నిలిచిన ఆధార్ సేవలు
కోటబొమ్మాళి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలమైన కోటబొమ్మాళి మండలంలో నాలుగు సచివాలయాల్లోని యంత్రాలు మరమ్మతుకు గురికావడంతో గత మూడు నెలలుగా ఆధార్ సేవలు నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులతో పాటు సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారు. కోటబొమ్మాళి, చీపుర్లపాడు, దంత, మహసాహెబ్‌పేట సచివాలయాల్లో యంత్రాలు మరమ్మతుకు గురికావడంతో ఆధార్ కేంద్రాల్లో సేవ లునిలిచిపోయాయి. కొత్తగా విద్యార్థులకు అపా ర్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేస్తుండడంతో ఆధార్‌లో తప్పులు సరిచేసుకునేందుకు అంతా ఇబ్బందిపడుతున్నారు.ఆధార్ సేవల కోసం సుదూర ప్రాంతాల్లోని నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది.
పలాస రైల్వేస్టేషన్‌లో 48 కేజీల గంజాయి పట్టివేత
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ అనుమానాస్పద కదలికలతో జీఆర్పీ పోలీసులకు ముగ్గురు వ్యక్తులు 48 కేజీల గంజాయితో ఆదివారం దొరికిపోయారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ రవికుమా ర్ పలాసలో ఆదివారం తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శివంకుమార్ చౌదరి, బదాయి మహతో, సాహెబ్‌కుమార్ చౌదరి అనే ముగ్గురు పలాస రైల్వే స్టేషన్ నుంచి గొండియా మీదుగా మహారాష్ట్ర ముంబై పట్టణానికి గంజాయి తరలించేందుకు ప్లాన్ వేశారు. పలాస రైల్వే స్టేషన్‌లో రైలులో ప్రయాణించేందుకు ప్లాట్‌ఫారంపై వేచి ఉండగా పోలీసులు వారి కదలికలు గమనించి వారిని ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 48 కిలోల గంజాయిని సీజ్ చేసి అనంతరం ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. కార్యక్రమంలో జీఆర్పీఎస్ పలాస సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే షరీఫ్, ఆర్‌హెచ్‌సీ మెట్ట సోమేశ్వరరావు, ఆర్‌పిసిఎస్ సంతోష్‌కుమార్, తులసి, దేవేంద్రనాధ్, అనిత, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడ చూసినా ఇసుక పోగులే
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలో జాతీయ రహదారికి ఆనుకుని తమ్మినాయుడుపేట ఇసుక రీచ్ ఉంది. దీనికి సమీపంలోనే తోటాడ, అక్కువరంలోనూ ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఈ రీచు ల్లో రాత్రిళ్లు పొక్లెయినర్లతో ఇసుక తవ్వి పోగు లు వేస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటలు సమయంలో విశాఖపట్నంకు తరలిస్తున్నారు. ప్ర స్తుతం 40 ట్రాక్టర్ల ద్వారా ఇసుక పోగులు వేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక పంచాయతీ, పక్క గ్రామాల ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారారు. ఇక్కడ జాతీయ రహదారిపై నాగా వళి నదిపై రెండు వంతెనలు ఉన్నాయి. తోటా డ సమీపంలో తాగునీటి పథకం ఇన్‌పిల్లర్లు ఉన్నాయి. ఇంతలా ఇసుక తవ్వితే వీటికి ప్రమాదం ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గౌరీదేవి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు
కాశీబుగ్గ: పలాస మండలం చినంచల గ్రామంలో పురాతనంగా వస్తున్న గౌరీదేవి ఉత్సవాలను కాశీబుగ్గ పోలీసులు శనివారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. స్టేజ్ ప్రోగ్రాంలో అశ్లీల నృత్యాలు వేస్తూ అశ్లీల పాటలు పాడుతున్నారని ఐదుగురు డాన్సర్లు, ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసిన చినంచల గ్రామస్తుడిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ ఎస్‌ఐ మోహనరావు తెలిపారు. సంప్రదాయంగా వస్తున్న గౌరీదేవి ఉత్సవాలను అడ్డు కుని ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment