ఉరిమే ఉత్సాహం
ఉత్సాహంగా పోటీలు..
తొలిరోజు పోటీలన్నీ ఉత్సాహభరితంగా సాగా యి. 13 జిల్లాల నుంచి 1000 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. వీరి వెంట కోచ్‌లు, మేనేజర్లు వచ్చారు. కేఆర్ స్టేడియం మైదానంలో అండర్–17 బాలబాలికలకు అథ్లెటిక్స్ ఈవెంట్స్‌లో పోటీలు జరగగా, సమీపంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అండర్–17,19 విభాగాల్లో బాలబాలికలకు ఉషూ పోటీలు జరిగాయి. ముఖ్యంగా అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. తొలిరోజు హార్డిల్స్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్, జావెలిన్‌త్రో తదితర ఈవెంట్స్ నిర్వహించారు. గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప, విశాఖ, ఉభయగోదావరి, శ్రీకాకుళం జిల్లాల క్రీడాకారులు సత్తాచాటుతున్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో 68వ ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్ జిల్లాల) స్కూల్‌గేమ్స్ అథ్లెటి క్స్, ఉషూ చాంపియన్‌షిప్–2024 పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ పరిధిలో ఉన్న పాత్రునివలసలో 33 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడులతో కలిసి ఆయన హాజరయ్యారు. అంతకుముందు వివిధ జిల్లాల క్రీడాకారు లు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి, పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర నాయకుడు చౌదరి పురుషోత్తమనాయుడు, డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సిల్వర్‌జూబ్లీ ఆడిటోరియంలో ఉషూ పోటీలను ఎమ్మెల్యే గొండు శంకర్ మధ్యాహ్నం ప్రారంభించారు.
షాట్‌పుట్ విసురుతున్న ఎండీ ఆసియా
(గుంటూరు)
ప్రారంభమైన 68వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలు
రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన క్రీడాకారులు
హోరాహోరీగా పోటీలు
Comments
Please login to add a commentAdd a comment