వసతి గృహ విద్యార్థి మృతి
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని కాటవీధిలో ఉన్న వెనుకబడిన తరగతుల వసతిగృహం ఏడో తరగతి విద్యార్థి ఆదివారం ఆకస్మాత్తుగా మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం చిల్లపేట రాజాం గ్రామానికి చెందిన శ్యామలరావు (12) ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత మంచినీరు తాగి బట్టలు ఉతికేందుకు రూమ్ నుంచి వెళ్తూ.. కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వచ్చేసరికే మృతి చెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు తెలిపారు. శ్యామలరావును సహచర విద్యార్థులు ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే క్యాజువాలిటీ వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారని చెప్పారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్యామలరావు కుటుంబ సభ్యులు సర్వజన ఆస్పత్రికి చేరుకొని విలపించారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్
వసతిగృహ విద్యార్థి శ్యామలరావు మృతిపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అధికారులను నివేదిక కోరారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద విద్యార్థి మృతికి సంబంధించి సహచర విద్యార్థులు, వసతిగృహం సిబ్బందితో ఆయన ఆదివారం మాట్లాడారు. సంఘటనపై ఆరా తీశారు. విద్యార్థి మృతిపై వైద్యులతో మాట్లాఆరు. ఈ సంఘటనపై సమగ్ర నివేదికను రెండు రోజుల్లో అందజేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షే మ శాఖ అదికారికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట చైల్డ్‌లైన్ సిబ్బంది ఉన్నారు.
చిల్లపేటరాజాంలో విషాదం
రణస్థలం: విజయనగరం కాటవీధిలోని బీసీ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందడంతో స్వగ్రామం చిల్లపేటరాజంలో విషాద ఛాయలు అలముకున్నా యి. మండలంలోని చిల్లపేటరాజాం గ్రామానికి చెందిన కొణతాల శ్యామలరావు(12) 7వ తరగతి చదువుతూ హాస్టలో ఉంటున్నాడు. అకస్మాత్తుగా విద్యార్థి చనిపోయాడనే వార్త రావడంతో ఊరంతా ఉలిక్కిపడింది. శ్యామలరావు తల్లి రెండేళ్ల కిందటే చనిపోయారు. తండ్రి కొణతాల చినసత్యం పూసపాటిరేగ సమీపంలోని మైలాన్ పరిశ్రమలో రోజు కూలీ పని చేస్తూ స్వగ్రామంలోనే ఉంటున్నాడు. కుమార్తె స్నేహాలతరెడ్డి ఆరో తరగతి పూసపాటిరేగ మండలంలోని గుంపాం అమ్మమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. విజయనగరంలో శవపంచనామా చేసి అనంతరం స్వగ్రామం చిల్లపేట రాజాంలో దహన సంస్కరణలు చేశారు.
ఆస్పత్రికి వచ్చేసరికే మృతి చెందాడన్న వైద్యులు
నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్
Comments
Please login to add a commentAdd a comment