కక్ష సాధింపులను సహించబోము
వజ్రపుకొత్తూరు: కూటమి ప్రభుత్వ నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించబోమని, పార్టీ కార్యకర్తలకు కాపాడుకుంటామని మా జీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర డాక్టర్స్ సెల్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్‌లో కొండపల్లికి చెందిన పార్టీ కార్యకర్త మడ్డు జష్వంత్‌ను అరెస్టు చేయడంపై ఆయన మండిపడ్డారు. విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. తమ కార్యకర్తలను వదిలే వరకు ఇక్కడే ఉంటానని ఎస్‌ఐ నిహార్‌కు స్పష్టం చేసారు. ఈ నెల ఒకటో తేదీన నువ్వలరేవులో పింఛన్లు పంచుతుండగా బైనపల్లి దానమ్మ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రమా దం తప్పింది. ఈ పరిస్థితిని జష్వంత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ మోహనరావు ఆదివారం పోలీసుల కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆగమేఘాల మీద స్పందించి జష్వంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కుపల్లిలో మృతుల పరామర్శలో ఉండగా విషయం తెలుసుకున్న అప్పలరాజు మండలంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐతో మాట్లాడారు. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని, నువ్వలరేవులో ఏం జరిగిందో మీకు తెలియ దా అంటూ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సూరాడ మోహనరావును పోలీస్‌స్టేషన్‌లోనే నిలదీశారు. వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోతే తానే ట్రీట్‌మెంట్ ఇప్పించానని, ఇవేవీ పరిశీలించకుండా పోస్టింగ్ చేసినంత మాత్రాన ఇంటికెళ్లి భయాందోళనకు గురి చేయడం ఏంటని ఎస్‌ఐ నిహార్, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిని ప్రశ్నించారు. జష్వంత్‌ను 15 నిమిషాలు విచారణ చేసి వదిలేస్తామని హామీ ఇవ్వడంతో సీదిరి ఎస్‌ఐ చాంబర్ నుంచి బయటకు వచ్చారు. విచారణ అనంతరం జష్వంత్‌ను వదిలేశారు. ఈ విషయమై ఎస్‌ఐను వివరణ కోరగా వచ్చిన ఫిర్యాదు మేరకు మడ్డు జష్వంత్‌ను విచారణకు పిలిచామని, కేసు నమోదు చేయలేదని తెలిపారు. సీదిరితో పాటు మండల ప్రత్యేక ఆహ్వానితుడు యు.ఉదయ్‌కుమార్, పీఏసీఎస్ అద్యక్షుడు దువ్వాడ మధుకేశవరావు, పలాస మాజీ ఎంపీపీ బి.హేమేశ్వరరావు, ఐరోతు హేమంత్‌రాజు, దువ్వాడ ఉమామహేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
Comments
Please login to add a commentAdd a comment