వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ గ్యాంగ్ పట్టివేత
అందరూ ఎచ్చెర్ల మండల వాసులే
33 నేరాల్లో 53 ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసిన గ్యాంగు
శ్రీకాకుళం క్రైమ్ : పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లే వారికి టార్గెట్. ట్రాన్స్‌ఫార్మర్లలో ఉండే కాపర్, అల్యూమినియం విలువైనవని తెలుసుకు ని గత మూడేళ్లుగా 33 నేరాలు చేసి 53 ట్రాన్స్‌ఫార్మర్లు దొంగిలించారు. ఎట్టకేలకు జిల్లా పోలీసులకు ఆ గ్యాంగ్ పట్టుబడింది. వారి నుంచి రూ.1.53 కోట్ల విలువ గల కాపర్ (636 కిలోలు) అల్యూమినియం 5 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారంతా ఎచ్చెర్ల మండలానికి చెందినవారు కాగా అధికంగా యు వకులే ఉండడం విశేషం. ఈ మేరకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న రణస్థలం మండలం మహంతిపాలెం గ్రామవాసి కెళ్ల వెంకటరమణ వ్యవసాయ పొలంలో ఉన్న 3–ఫేజ్ 16 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను పగలగొట్టి అందులో ఉన్న సుమారు 12 కిలోల రాగివైరును దొంగిలించడంతో రమణ ఫిర్యాదు చేశారు. జేఆర్ పురం సీఐ ఎం.అవతారం నేతృత్వంలోని ఓ ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. దొంగలు దొరి కాక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చెడు వ్యసనాలకు లోనైన వారే..
ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన కుప్పిలి వరప్రసాద్ (23) స్వతహాగా ఎలక్ట్రీషియన్. చెడు వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడిన వరప్రసాద్ అదే గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న బోర సాయి (19)తో కలిసి పథక రచన చేశాడు. ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్‌కు మంచి డిమాండ్ ఉందని తెలుసుకుని వాటిని చోరీ చేసేందుకు మూడేళ్ల కిందటే పన్నా గం పన్నారు. వీరికి ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎస్‌ఆర్ పురానికి చెందిన బలగ రామకృష్ణ (35), బలగ శివ (30), బయ్యన్నపేట గ్రామానికి చెందిన బుడుమూరు గోవింద్, అజ్జరాం గ్రామానికి చెందిన సడి సత్యం (20)లు జతకలిశారు. వీరికి విశాఖపట్నంలోని ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తున్న సాయి మేనమేమ దువ్వు అసిరినాయుడు (30) సహకరించాడు.
దొంగిలించిన సొత్తును..
ప్లాన్ ప్రకారం అవసరాన్ని బట్టి వాళ్లలో వ్యక్తులను ఒక్కో చోరీలో ఒక్కొక్కళ్లను ఉపయోగించుకుని గత మూడేళ్లుగా దొంగిలించిన సొత్తును విశాఖలో ఉన్న అసిరినాయుడుకు అప్పజెప్పేవా రు. అతను పనిచేస్తున్న షాపులోనే యజమానిగా ఉన్న కృష్ణారెడ్డికి (ఈయన స్వగ్రామం కూడా అజ్జరాం) అమ్మేసి డబ్బులు చేసుకునేవారు. వీరితో అప్పుడప్పుడు ఎచ్చెర్ల మండలం కుప్పిలి, అజ్జరం గ్రామాలకు చెందిన ఇద్దరు బాలురు కూడా చోరీలకు వెళ్లేవారు.
ఎలా పట్టుబడ్డారంటే..
జిల్లాలోని జె.ఆర్.పురం, ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడాం, పొందూరు పీఎస్‌ల పరిధిలోని గ్రామా ల్లో సుమారు 53 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీ చేసి అందులో ఉన్న 636 కిలోల (350 కిలోలరాగివైరు, 286కిలోల రాగి దిమ్మలు) కాపర్, 5 కిలోల అల్యూమినియం వైర్లను దొంగిలించారు. ఆదివారం రణస్థలం మండలం బీరు ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న పాడుబడిన భవనం వెనుక నిందితులు ఉన్న విషయం తెలుసుకున్న సీఐ అవతారం తమ సిబ్బందితో కలిసి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, బాలురు ఇద్దరిని జువైనల్ హోంకు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. అంతేకాక జిల్లాలో ఇంకా ఇటువంటి ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసిన మరో రెండు గ్యాంగులను, చైన్‌స్నాచింగ్ చేస్తున్న మరో గ్యాంగును కూడా గుర్తించామని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ అన్నారు.
ప్రతిభకు ప్రశంసలు..
కేసును చాకచక్యంగా ఛేదించడంలో కృషిచేసిన డీఎస్పీ సిహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్‌ఐలు ఎస్.చిరంజీవి, జి.లక్ష్మణరావు, వై.మధుసూదనరావు, కె.కిరణ్‌కుమార్‌సింగ్, హెచ్‌సీలు కె.లక్ష్మణరావు, ఎం.జోగారావు, డి.తవిటినాయుడు, కె.సూర్యారావు, సీహెచ్ సురేష్‌లను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment