ఆద్యంతం అలరించేలా..
● శ్రీకాకుళంలో లాంఛనంగా ప్రారంభమైన 68వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలు
●బాస్కెట్‌బాల్, మోడర్న్ పెంటాథ్లెన్
క్రీడాంశాల్లో తుది దశకు చేరుకున్న పోరు
● నేటితో ముగియనున్న మూడు రోజుల క్రీడా పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ వేదికగా 68వ ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్‌జిల్లాల) స్కూల్‌గేమ్స్ బాలబాలికల బాస్కెట్‌బాల్ (అండర్–19), మోడర్న్ పెంటాథ్లాన్ (అండర్–17,19) చాంపియన్‌షిప్–2024 పోటీలు ఆదివారం లాంఛనంగా ప్రారంభమయ్యా యి. ఈ సందర్భంగా రంగురంగుల దుస్తులతో హాజరైన బాలబాలికలతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల క్రీడాకారు లు ప్రదర్శించిన మార్చ్‌పాస్ట్ విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ క్రీడాజ్యోతిని వెలిగించి, పోటీలను ప్రారంభిస్తున్నట్టు చదివి వినిపించారు. బాస్కెట్‌బాల్ ఆడి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. డీఎస్‌డీఓ డాక్టర్ కె.శ్రీధర్‌రావు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య, స్థానిక జీడీసీ మెన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేఖ, పీఈటీ సంఘ జిల్లా నాయకుడు ఎంవీ రమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, బాస్కెట్‌బాల్ సంఘ జిల్లా కార్యదర్శి జి.అర్జున్‌రావురెడ్డి, పీఈటీ సంఘ ఎస్.సూరిబాబు, కె.మాధవరావు, పేడాడ బాబూరావు, నిర్మల్‌కృష్ణ, బి.మాధురి, పీడీలు పాల్గొన్నారు.
షాకిచ్చిన కేంద్ర మంత్రి
కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు క్రీడా నిర్వాహకులకు షాకిచ్చారు. వాస్తవానికి శనివారమే పోటీలు మొదలయ్యాయి. అయితే శనివారం ఉదయం, లేదా సాయంత్రం పోటీలను అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆదివారం ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి వస్తానని చెప్పారు. కానీ ఆ సమయానికి నిర్వాహకులకు షాకిస్తూ హాజరుకాలేనని బదులిచ్చారు.
నేటితో ముగియనున్న పోరు..
రాష్ట్ర స్కూల్‌గేమ్స్ పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరుగుతున్న అండర్–19 బాస్కెట్‌బాల్ పోటీల్లో క్వార్టర్స్ ఫైనల్స్ నుంచి రక్తి కట్టిస్తున్నాయి. ఆతిథ్య శ్రీకాకుళం జట్లు నిరాశను మిగిల్చాయి. బాలురు జట్లు లీగ్‌లోనే నిష్క్రమించగా, బాలికల జట్టు క్వార్టర్స్‌ఫైనల్స్‌లో బలమైన కృష్ణా జిల్లా చేతిలో ఓటమిపాలైంది. రాత్రి 11 వరకు మ్యాచ్‌లు కొనసాగాయి. పోటీలను తిలకించేందుకు పెద్దఎత్తున యువత హాజరవుతుండటంతో సందడి వాతావరణం నెలకొంది. బాలికల విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాలు, బాలురు విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలు సెమీస్‌కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment