పంచారామాలకు బయల్దేరిన ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆదివారం ఆర్టీసీ శ్రీకాకుళం 1, 2 డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కెఆర్‌ఎస్ శర్మలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పంచారామాల ప్రత్యేక బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. ఈ సర్వీసులో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో గల శివాలయాల దర్శనానికి వెళ్తారని చెప్పారు. ఈ నెల 17, 24 తేదీల్లో కూడా పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. 10వ తేదీ ఆదివారం జిల్లా నుంచి పంచారామాలకు మూడు బస్సులు బయలుదేరినట్లు తెలిపారు. ‘ఒక్క ఫోన్ కాల్‌తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు‘ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 99592 25608, 9959225609, 9959225610, 99592 25611 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్‌లు వి.రమేష్, ఎ.గంగరాజు, టెక్కలి అసిస్టెంట్ మేనేజర్ పీఎస్‌ఎన్ మూర్తి, ఓపీఆర్‌ఎస్ సూపర్‌వైజర్ ఎండిఎ బాషా, ప్రసాద్, ఎంపీ రావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment