మెరుగైన ఫలితాలతో..
బూర్జ: ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావుకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. ఈయన 13 జూన్ 2013 నుంచి ఎచ్చెర్ల మండలం, కుప్పిలి ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించారు. అనంతరం బూర్జ మండలం, ఓవీ పేట ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా13 మే 2022 నుంచి పనిచేస్తున్నారు. 2018న ఈయన జిల్లాస్థాయి అవార్డు కూడా అందుకున్నారు. రాష్ట్రంలోని 164 ఏపీ మోడల్‌స్కూళ్లలో తనకు ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈయన కృషితో పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి.
వినూత్న బోధన
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని గోవిందపురం గ్రామంలో ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గుంటముక్కల శ్రీనివాసరావుకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. ఈయన స్వగ్రామం గార మండలంలోని అంపోలు. 2000లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఈయన తొమ్మిదేళ్లు కోటబొమ్మాళిలో, ఏడున్నరేళ్లు ఎచ్చెర్ల మండలంలోని వెంకటాపురం గ్రామంలో, ఎనిమిదేళ్లు పొందూరు మండలం లైదాం గ్రామాల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి ఏడాది నుంచి లావేరు మండలం గోవిందపురం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును పొందారు. తరగతి బోధనతో పాటు వెనుకబడిన విద్యార్థులకు లోకాస్ట్ వస్తువులతో యాక్టివిటీస్ ద్వారా విద్యాబోధన చేస్తుంటారు. అంతేకాకుండా ఇతను స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా ఉన్నారు. టీచర్లకు బోధన పరమైన శిక్షణలను ఇస్తుంటారు. ఈ అవార్డు రావటంతో ఎంఈఓ మురళీకృష్ణతో పాటు పలువురు ఉపాధ్యాయులు ఈయనను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment