ఉమారుద్రునికి పుష్పాలంకరణ
శ్రీకాకుళం కల్చరల్: పురాతన ఉమారుద్ర కోటేశ్వర దేవాలయంలో రెండో సోమవారం సందర్భంగా ఆదివారం స్వామికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ఈఓ సర్వేశ్వరరావు, అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తిల ఆధ్వర్యంలో పార్వతీదేవిని కూడా పుష్పాలతో అలంకరించారు.
శ్రీముఖలింగేశ్వరుని సేవలో కలెక్టర్
జలుమూరు: శ్రీముఖలింగంలో వెలసిన మధుకేశ్వరుడిని ఆదివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి స్వామికి ఏకవార అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వారాహి అమ్మవారికి కుంకమపూజలు చేశారు. అర్చకులు ఆలయ విశేషాలతోపాటు గోలెం కఽథ, స్వామి చరిత్ర వివరించారు. అనంతరం శేషవస్త్రాలు అందించి పుణ్యహవచనాలతో దీవించారు.
బలమైన వామపక్ష వేదిక ఏర్పాటు చేస్తాం
కాశీబుగ్గ: అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కార్పొరేట్ శక్తులకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలమైన వామపక్ష వేదిక ఏర్పాటుకు కృషిచేయాలని పెద్దలు ముక్తకంఠంగా వెల్లడించారు. సీపీఎం జిల్లా 18వ మహాసభల్లో రెండో రోజు ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెండి తులసీదాస్ తొలి ప్రసంగం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రాణం పోసిన పలా స నేలపై సీపీఎం జిల్లా మహాసభలు నిర్వహించడం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో సీపీఎం చురుకై న పాత్ర పోషించిందని, జిల్లాలో వామపక్ష ఐక్య ఉద్యమానికి ఇక్కడి నుండే శ్రీకారం చుట్టాలని అన్నారు. వామపక్ష పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కోరారు. సీపీఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి తామా డ సన్యాసిరావు మాట్లాడుతూ భారతదేశం జనాభాలోను పేదరికంలోనూ అగ్రస్థానంలోకి వెళ్తున్నదని, ఇది భారతదేశ పరిస్థితిని హెచ్చరిస్తోందని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులకు రాష్ట్ర సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తులసిదాస్, జిల్లా కార్యదర్శి దుప్పల గోవిదం నివాళులర్పించారు. మహాసభల్లో ప్రజా కళాకారులు ఆటపాటలు, డప్పు వాయిద్యాలు మహాసభల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి.
ఆంధ్రా క్రికెట్ జట్టుకు
ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి జిల్లా నుంచి ఇద్దరు క్రికెటర్లకు ఛాన్స్ లభించింది. 2024–25 సీజన్‌కుగాను ఆంధ్రా జట్టుకు జిల్లా నుంచి త్రిపురాన విజయ్, సింగుపురం దుర్గనాగ వర(ఎస్‌డీఎన్‌వీ)ప్రసాద్ ఎంపికయ్యారు. 16 మంది సభ్యులతో కూడిన తుది జాబితాలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. నాల్గో స్టాండ్‌బైగా సీనియర్ ఆటగాడు ఎస్‌హెచ్ శ్రీనివాస్‌ను ఎంపికచేశారు.
Comments
Please login to add a commentAdd a comment