ఆదిత్యుని సన్నిధిలో కార్తీక పూజలు
అరసవల్లి: కార్తీక మాసం మూడో ఆదివారం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. ప్రత్యేక ఆదివారం కావడంతో ఇతర జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొ క్కులు చెల్లించుకున్నారు. పవిత్ర ఇంద్రపుష్కరిణిలో స్నానాలు చేసి కార్తీక దీపారాధన చేసారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులు ప్రత్యేక, విశిష్ట, ఉచిత దర్శనాల క్యూలైన్లలో బారులు తీరగా, 10 గంటల నుంచి ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో ఆలయ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సజావుగా దర్శనాలు అయ్యేలా చర్యలు చేపట్టారు. ఆలయ ఈఓ వై.భద్రాజీ ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఒక్క రోజులో రూ.9,02,772 వరకు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలియజేశారు. వివిధ దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ.4,21,200, విరాళాలు ప్రత్యేక పూజల ద్వారా రూ.1,66,572, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.3.15 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment