స్పెషల్ బీఎడ్ స్పాట్ అడ్మిషన్లకు ఏడు దరఖాస్తులు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న స్పెషల్ బీఎడ్ (మెంటల్లీ రిటార్డ్)లో ఎడ్‌సెట్ –2024 కౌన్సె లింగ్ అనంతరం మిగిలిన ఏడు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించగా ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. అర్హత పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నట్లు కోర్సు కో–ఆర్డినేటర్ స్వామినాయుడు బుధవారం తెలిపారు.
22న బొల్లినేని మెడిస్కిల్స్‌లో జాబ్‌మేళా
శ్రీకాకుళం రూరల్: మండలంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి, బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18 నుంచి 20 ఏళ్లలోపు విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.13,500 వేతనం అందుతుందని, అనకాపల్లి జిల్లా పరవాడలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌మేళాకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
అలరించిన సంగీత కచేరి
శ్రీకాకుళం కల్చరల్: కచ్చపి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నగరంలోని బాపూజీ కళామందిర్‌లో బుధవారం నిర్వహించిన గాత్ర కచేరి ఆద్యంతం అలరించింది. మృదంగ రత్నాకర వి.కమలాకరరావు, శ్రీపాద పినాకపాణిలను స్మరించుకుంటు మల్లాది సోదరులు శ్రీరాం ప్రసాద్, రవికుమార్‌లు పలు కీర్తనలను వీనుల విందుగా గానం చేశారు. కార్యక్రమంలో సభ్యులు శ్రీరామచంద్రమూర్తి, ఇప్పిలి శంకరశర్మ, పులఖండం శ్రీనివాసరావు, పి.జగన్మోహనరావు, బగ్గామ్ ధనుజయ్ పట్నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో పురుగు
మందు తాగి వ్యక్తి మృతి
బూర్జ: మండలంలోని సింగన్నపాలేం గ్రామానికి చెందిన పొగిరి అప్పలనాయడు (48) పురుగు మందు తాగి మంగళవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు అప్పలనాయుడు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తన సొంత వ్యవసాయ పొలం నిమిత్తం తెచ్చిన పురుగు మందును మద్యం అనుకొని తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆరా తీయగా పురుగు మందు సేవించినట్లు తెలపడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహ నం సాయంతో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడు తల్లి పొగిరి అప్పలనర్సమ్మ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసుస్టేషన్ ఎస్‌ఐ ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. మృతుడికి భార్యా వనజాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం, మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment