జూడో పోటీలకు వర్సిటీ క్రీడాకారిణులు
ఎచ్చెర్ల క్యాంపస్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని ఎల్‌ఎన్‌సీటీ విశ్వ విద్యాలయంలో ఈనెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సౌత్ వెస్ట్ అంతర విశ్వ విద్యాలయాల జూడో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరుపున క్రీడాకారిణులు సీహెచ్ సాయికుమారి (శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల), వి.కావ్య (శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల) పాల్గొంటున్నారు. వీరిని వర్సిటీలో ప్రత్యేకంగా వీసీ రజిని, రిజిస్ట్రార్ సుజాత బుధవారం అభినందించారు. క్రీడల్లో సత్తా చూపి వర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు
పిల్లలవలస విద్యార్థి
పొందూరు: మండలంలోని పిల్లలవలస జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గురుగుబెల్లి సోమశేఖర్ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని మాష్కండ్‌లో 68వ జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో అండర్–14 విభాగంలో సోమశేఖర్ పాల్గోనున్నాడు. దీంతో విద్యార్థికి అవసరమైన ఖర్చుల కోసం సర్పంచ్ బి.పోలినాయుడు, ఉప సర్పంచ్ జి.కృష్ణమూర్తి ఆర్థిక సాయం అందించారు. విద్యార్థికి హెచ్‌ఎం కాసులబాబు, పీడీ జి.రాజశేఖర్‌రావు, ఉపాధ్యాయులు, ప్రజలు అభినందించారు.
సాఫ్ట్‌బాల్ పోటీలకు
తాడివలస విద్యార్థులు
పొందూరు: ఈనెల 22వ తేదీ నుంచి 23 వరకు రెండు రోజులు పాటు జరగనున్న అండర్–14 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు తాడివలస ఉన్నత పాఠశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం బల్ల కంటయ్య బుధవారం తెలిపారు. వాకముల్లు నిత్యశ్రీ, తొగరాపు భార్గవి, సుందరాపల్లి విజయరాజులు ఎంపికయ్యారని చెప్పారు. సర్పంచ్ తమ్మినైన మణెమ్మ, ఎంపీటీసీ సువ్వారి దివ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: రాజ్‌కోట్ వేదికగా జరగనున్న జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు దీక్షా బెహర, పైడి హర్షిత ఎంపికై నట్టు డీఎస్‌ఏ స్విమ్మింగ్ కోచ్ డి.మురళీధర్ బుధవారం తెలిపారు. ఇటీవల నరసారావుపేటలో జరిగిన రాష్ట్రపోటీల్లో వీరిద్దరూ పతకాలతో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికై నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment