వైకల్యాన్ని ఎదిరించి..
శ్రీకాకుళం పాతబస్టాండ్: పట్టుదల, ప్రోత్సాహం ఉంటే వైకల్యం అడ్డుకాదనే విషయాన్ని ఎంతోమంది నిరూపించారని, అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి
ఎం.వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. డిసెంబరు 3న జరగనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను శ్రీకాకుళంలోని ఆర్‌అండ్‌బీ (డచ్) భవనం వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకల్యంతో బాధపడకుండా క్రీడల్లోనూ రాణించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతిశ్రీ మాట్లాడుతూ నవంబరు 1 నుంచి 30 వరకు అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ మాట్లాడుతూ చట్టబద్ధమైన పిల్లల దత్తతపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత మాట్లాడుతూ డిసెంబరు 3న నిర్వహించనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నాడు విజేతలకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. అనంతరం నడక, షాట్‌ఫుట్, డిస్కస్ త్రో, చెస్, పాటల పోటీలు, కేరమ్స్, క్రికెట్, జావెలెన్ త్రో, ట్రై సైకిళ్లు తదితర పోటీల్లో విభిన్న ప్రతిభావంతులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, డ్వామా పీడీ సుధాకర్, సీపీఓ లక్ష్మీప్రసన్న, సెట్‌శ్రీ సీఈఓ ప్రసాదరావు, నైపుణ్యాభివద్థి అధికారి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సహాయకురాలితో కలిసి పరుగు
పందెంలో పాల్గొన్న అంధ బాలిక
ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల పోటీలు
జిల్లా నలుమూలల నుంచి హాజరైన బాలబాలికలు
Comments
Please login to add a commentAdd a comment