● యాప్‌ల భారం తగ్గించి..
రాజకీయ వేధింపులు ఆపాలంటూ ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి పనిచేస్తున్న గ్రామ సంఘం సహాయకులు (వీఓఏ–సీఎఫ్)లు సమస్యల పరిష్కారం కోరుతూ కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం వచ్చాకర పనిభారం, రాజకీయ వేధింపులు, గౌరవ వేతనాల విడుదలలో జాప్యం, పాత జీవోలు తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేయడం వంటి విధానాలు అనుసరిస్తున్న సర్కారుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఐటీయూతో కలిసి వీఓఏ సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపీ వెలుగు వీఓఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రభావతి, జి.అసిరినాయుడులు మాట్లాడుతూ వెలుగు వీఓఏలకు మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐదునెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. ఇటీవల రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సర్క్యులర్‌ను అమలు చేసేందుకు, రాజకీయ కక్ష సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యాప్‌ల భారం పెంచుతున్నారని వాపోయారు. అనంతరం కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment