తనిఖీలు ముమ్మరం
ఇచ్ఛాపురం: ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతం గుండా నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసులకు ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఇచ్ఛాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌లలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. గంజాయి నియంత్రణకు సంకల్పం పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పురుషోత్తపురం చెక్‌పోస్టును పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు, సీఐ మీసాల చిన్నంనాయు డు, ఎస్సై చిన్నంనాయుడు పాల్గొన్నారు.
బాలల హక్కులు పరిరక్షిద్దాం
శ్రీకాకుళం అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దామని మహిళా, శిశు సంక్షేమ సాధికారత జిల్లా అధికారి బి.శాంతిశ్రీ అన్నా రు. బుధవారం బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ కూడలి వరకు బాల, బాలికలు చేపట్టిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ 14న బాలల దినోత్సవం, 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద మాట్లాడుతూ మానవ హక్కులు, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ కె.చెన్నకేశవరావు, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment