అడిషనల్ కమాండెంట్ డీఎస్పీగా నాగేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా అడిషనల్ కమాండెంట్ ఫస్ట్ బెటాలియన్ డీఎస్పీగా జి.నాగేశ్వరరెడ్డిని నియమిస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈయన ప్రస్తుతం వెయిటింగ్ డీఎస్పీగా కొనసాగుతున్నారు.
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆహారం, తాగునీరు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దరి చేరవని డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ‘ఎన్.ఆర్.ఎల్.ఎం – ఆహారం, పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత’ అనే అంశంపై గ్రామీణ నీటి సరఫరా శాఖ, డీఆర్‌డీఏలు సంయుక్తంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఆరుబయట మల, మూత్ర విసర్జన మానుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ధనలక్ష్మి, టి.పార్వతి, బి.మల్లేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది డి.దాలినాయుడు, ఎస్.మురళీమోహన్, అమ్మాజీరావు, ఏరియా కో–ఆర్డినేటర్లు, ఏపీడీలు, సీసీలు పాల్గొన్నారు.
వృత్తి విద్య కోర్సులో ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ శిక్షణ కేంద్రంలో వృత్తి విద్య కోర్సులు టైలరింగ్, కంప్యూటర్ అకౌంటెన్సీలో 30 రోజుల శిక్షణకు దరఖాస్తులు
ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు అర్హులని తెలిపారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 2 నుంచి కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వివరాలకు 79933 40407, 95534 10809 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment