ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం
నరసన్నపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు సిబ్బంది సన్నద్ధం కావాలని సివిల్ సప్లయ్ డీఎం శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతు సేవా కేంద్రాల వీఏఏలు, వీఆర్వోలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యంలో 17 శాతం పైబడి తేమ శాతం ఉండకూడదన్నారు. వాహనానికి జీపీఎస్ ఉంటేనే మిల్లుకు తరలించాలన్నారు. గోనె సంచులు, కలాశీల ఖర్చులు రైతుల ఖతాలకే జమ చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీడీఓ బి.మధుసూదనరావు, వ్యవసాయాధికారి కె.సునీత, సివిల్ సప్లయ్ డీటీ రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment