రెడ్డిక సంఘాన్ని బలోపేతం చేద్దాం
ఇచ్ఛాపురం/రూరల్: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న రెడ్డిక సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని రెడ్డిక సంఘం తీర్మానించింది. బుధవారం ఇచ్ఛాపురంలో శ్రీకాకుళం–పూరీ–గంజాం జిల్లాల రెడ్డిక మహాజన పురోభివృద్ధి సంఘం ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఉభయ రాష్ట్రాల రెడ్డిక సంఘం ఏర్పాటు చేసి 2025కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే ఏడాది మేలో సంఘ చరిత్ర, ఐక్యత, కట్టుబాట్లు ఉట్టిపడేటట్లు వేడుకలను నిర్వహించేందుకు సంఘ ప్రతినిధులు ఆమోదించారు. కార్యక్రమంలో సీడాప్ మాజీ చైర్మన్ సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎంపీపీ పైలా దేవదాసురెడ్డి, మాజీ ఎంపీపీలు కారంగి మోహనరావు, దక్కత ఢిల్లీరావు, చాట్ల తులసీదాసురెడ్డి, ఆశి చిరంజీవులు, ఉప్పాడ రాజారెడ్డి, దక్కత కృష్ణమూర్తిరెడ్డి, బుడ్డేపు కామేష్‌రెడ్డి, పిలక యాదవరెడ్డి, నియోజకవర్గ రెడ్డిక కుల పెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment