అబ్బే అంతా తూచ్‌..! | - | Sakshi
Sakshi News home page

అబ్బే అంతా తూచ్‌..!

Published Thu, Nov 21 2024 12:26 AM | Last Updated on Thu, Nov 21 2024 12:26 AM

అబ్బే

అబ్బే అంతా తూచ్‌..!

రీసర్వే అనంతరం అందజేత

వేట నిషేధ భృతిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందజేయనుంది. అయితే అర్హు ల జాబితాలో అనర్హుల ఏరివేత కోసం 6 స్టెప్స్‌ వెరిఫికేషన్‌ను చేపడుతోంది. ఈ రీసర్వే అనంతరం అర్హులందరికీ భృతిని అందజేస్తారు. ఇప్పటికే సుమారుగా 12,340 మంది అర్హులుగా గుర్తించి నివేదించాం.

– పీవీ శ్రీనివాసరావు, డీడీ, మత్స్యశాఖ

వేట లేదు.. భృతి అందలేదు

నిరసన తప్పదు

మత్స్యకారులపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వేట నిషే దం పూర్తయ్యి ఆరు నెలలు దాటిపోయినా.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు అర్హుల గుర్తింపు కోసం రీసర్వే చేయాలంటూ తప్పించుకుంటోంది. ఈ పరిహా రాన్ని రూ.20 వేలుకు పెంచి ఇస్తామన్నారు. ఈనెలాఖరు నాటికి అర్హులందరికీ భృతి చెల్లించకపోతే.. జిల్లా కేంద్రంలో భారీగా నిరసనలు చేపడతాం.

– కోనాడ నర్సింగరావు, జిల్లా మత్య్సకార సహకార సంఘ అధ్యక్షుడు

అరసవల్లి:

ముద్రపు వేట ఆధారిత గంగపుత్రులకు దక్కాల్సిన వేట నిషేధ భృతిపై కూడా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ప్రతీఏటా ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి జూన్‌ 14 వరకు నిబంధనల మేరకు అమలవుతున్న నిషేధ సమయం పూర్తయ్యి ఆరు నెలలు గడుస్తున్నా భృతి మాట ఎత్తడం లేదు. గత ప్రభుత్వంలో వరుసగా ఐదేళ్లు పాటు ఒక్కో మత్స్యకారుడికి ఏటా రూ.10 వేల చొప్పున భృతిని అందజేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే, తాము అధికారంలోకి వస్తే ఆ భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆ హామీ నుంచి ఎలాగైనా తప్పించుకునేలా కప్పదాట్లు, కుంటి సాకులు వెదుకుతోంది. ఈక్రమంలో అర్హుల జాబితాను గుర్తించేందుకు మరోసారి సర్వే చేయాలని నిర్ణయించింది. ఇదే సాకుతో గత ఆరునెలల నుంచి భృతి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. తాజాగా ఈ భృతిని ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా చెల్లించలేమంటూ ఏకంగా శాసనసభలో సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక భృతి వచ్చే ఆశలు నీరు గార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాడు.. నేడు

సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఉపాధి కోసం భృతిని ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు ఒక్కొక్కరికీ రూ.4 వేల చొప్పున భృతిని చెల్లించారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఐదు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఏకంగా రూ.70 కోట్లకు పైగా భృతిని అందజేసి సంక్షేమ పాలను అందజేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ భృతిని రూ.20 వేలకు పెంచుతూ అందజేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించింది. అయితే ఇప్పటికే సమయం దాటినా ఇంకా అందించకుండా కుంటిసాకులు చెబుతోంది. ఇదిలావుంటే తాజా సర్వే అనంతర సమాచారం ప్రకారం 15,200 మందికి రూ.20 వేల చొప్పున ఈ ఒక్క జిల్లాలోనే మొత్తం రూ.30.40 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జిల్లాలో మత్స్యకారులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సంఖ్యను రీసర్వే పేరిట కుదించేలా కూటమి సర్కార్‌ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది.

3 వేల మందికి ఎసరు..?

జిల్లాలో 11 మండలాల పరిధిలో తీరప్రాంత మత్స్యకారులు వేటపై జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రతిఏటా 15వేలకు పైగా మత్స్యకారులు వేట నిషేధ కాలంలో ఇంటికే పరిమితమయ్యేవారు. ఈక్రమంలో అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష సర్వే ద్వారా అర్హులను గుర్తించి వారికి పరిహారాన్ని ఆన్‌లైన్‌ ద్వారా అందజేయాల్సి ఉంది. ఇందుకోసం మత్స్యశాఖ అధికారులు సర్వేను చేపట్టి 15,200 మంది అర్హులుగా గుర్తించారు. అయితే కూటమి ప్రభుత్వం దీనిపై మళ్లీ సర్వే చేసేలా చర్యలకు రాష్ట్ర మత్స్యశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. దీంతో ఇప్పుడా సంఖ్య 12,340 మందికి మాత్రమే పరిమితం కానుందని సమాచారం. సిక్స్‌ స్టెప్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా చాలామందిని అర్హత నుంచి తప్పించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఈసారి సుమారు మూడు వేల మందికి ఈ భృతి దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం కుట్రలతో ఆ మూడు వేల మందికి ఎసరు పెట్టినట్‌లైంది.

గత ప్రభుత్వం అందజేసిన భృతి

ఏడాది లబ్ధిదారులు భృతి జమ

2019–20 13,388 రూ.13.38 కోట్లు

2020–21 14,289 రూ.14.28 కోట్లు

2021–22 13,612 రూ.13.61 కోట్లు

2022–23 14,043 రూ.14.04 కోట్లు

2023–24 15,281 రూ.15.28 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
అబ్బే అంతా తూచ్‌..! 1
1/2

అబ్బే అంతా తూచ్‌..!

అబ్బే అంతా తూచ్‌..! 2
2/2

అబ్బే అంతా తూచ్‌..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement