ధాన్యం ప్రభుత్వానికి అమ్ముకోవచ్చని రైతులు ఆశ పడి ఎక్కడికక్కడ రాశులు పోసి ఉంచారు. కొన్నిచోట్ల దిబ్బలు వేసి ఉంచుకున్నారు. మరికొన్ని చోట్ల పొలాల్లోనే నూర్పులేసి ఉంచుకున్నారు. కొందరైతే రహదారుల వెంబడి ధా న్యం రాశులు పోశారు. వర్షానికి, గాలులకు ధాన్యం చెమ్మగిల్లకుండా పరదాలు, టార్పాలిన్‌లు కప్పి ఉంచారు. కానీ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. మోస్తరు వర్షపాతం నమోదైంది. నవంబర్ 30వ తేదీన 162.4మిల్లీమీటర్లు, డిసెంబర్ ఒకటో తేదీన జిల్లా వ్యాప్తంగా 155.3మిల్లీమీటర్ల వర్షం పడింది. 2వ తేదీ ఉదయం 8గంటల నాటికి 400మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు పడ్డాయి. దీంతో కల్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలు, పొలాల్లో ఉన్న వరి కంకులు పూర్తిగా తడిచిపోయాయి. పండి ఉన్న వరి చేను కోతకు పనికిరాకుండా పోయాయి. ధాన్యం కుప్పలు దాచుకోలేని దుస్థితి చోటు చేసుకుంది. కొన్నిచోట్ల పరదాలు, టార్పాలిన్‌లు దొరక్కపోవడంతో అలాగే ఉంచేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. పొలాల్లో నీటిని తోడేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. తడిచిన చేను ను తరలించేందుకు నానా కష్టాలు పడుతున్నా రు. ఎలా చూసినా రైతుకు నష్టమే మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment