వారం రోజుల్లోగా ఖాతాదారులకు సమాచారమిస్తాం
గార: గార ఎస్‌బీఐలో ఖాతాదారుల బంగారం ఎంతకాలం ఉంటే వాటి వడ్డీని చెల్లించాలన్న డిమాండ్‌పై ఉన్నతాధికారులతో మాట్లాడి వారం రోజుల్లోగా సమాచారమిస్తామని ఆ బ్యాంకు రీజనల్ మేనేజర్ అబ్దుల్ అమీర్ అసీద్ అన్నారు. మంగళవారం ఖాతాదారులు బ్యాంకు మెయిన్‌గేట్‌ను మూసివేసి నిరసనలు తెలియజేశారు. తమ బంగారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకు కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఆర్‌ఎంతో పాటు లాయర్ తిరుమలరావు ఖాతాదారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు. తనఖాలో ఉన్న బంగారాన్ని ఇవ్వాలని ఖాతాదారులు కోరితే కోర్టు పరిధిలో ఉందని, ఈ నెల 13వ తేదీ వాయిదా ఉందని అంతకుమించి ఏమీ చేయలేమని చెప్పారు. ఎస్‌ఐ ఆర్.జనార్ధనరావు, సర్పంచ్ మార్పు పృధ్వీరాజ్, మాజీ ఎంపీటీసీ జల్లు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. 11.30 గంటల తర్వాత బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment