మరో పోరుకు సిద్ధమవుదాం
కొత్తూరు: విద్యుత్ బిల్లుల విషయంలో కూటమి ప్రభుత్వం మాట మార్చిందని సీపీఎం జిల్లా కార్య దర్శి గోవిందరావు అన్నారు. కొత్తూరులో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని గోవిందరావు అన్నారు. రెండుసార్లు సర్దుబాటు పేర్లతో విద్యుత్ చార్జీలు పెంచడం భావ్యం కాదన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమన్నారు.
అదానీ కోసమే విద్యుత్ చార్జీలు పెంచుతున్నట్లు విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే మరోపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గంగరాపు సింహాచలం, జిల్లా కమిటి సభ్యుడు సిర్ల ప్రసాదరావు, కార్మిక సంఘం నాయకులు పల్ల కృష్ణలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment