దాష్టీకం
పేదల పాకలపై
● టీడీపీ నేతల కక్షపూరిత రాజకీయం
● 70 ఏళ్లుగా పేదలు
ఉంటున్న పాకల
తొలగింపు
● బోరుమంటున్న బైరివానిపేట గ్రామస్తులు
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని భైరివానిపేటలో టీడీపీ నేతలు కక్షపూరిత రాజకీయాలకు తెర లేపారు. ఈ గ్రామంలో సర్వే నంబర్ 83లో 1, 2, 3, 4 సబ్ డివిజన్‌లో గల చెరువు గర్భం 50సెంట్లతో పాటు సర్వే నంబర్ 44లోని గోర్జిలో 10సెంట్లు విస్తీర్ణం గల ప్రభుత్వ స్థలంలో కొందరు 70 ఏళ్లుగా పాకలు, గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వీరిలో చాలా మంది వైఎస్సార్ సీపీ మద్దతుదారులు. దీంతో స్థానిక సర్పంచ్‌తో పాటు టీడీపీ నేతలు కక్ష కట్టారు. అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పది కుటుంబాలకు చెందిన గుడిసెలను మంగళవారం కూలదోయించారు. దీంతో పేదలు లబోదిబోమన్నారు.
బతిమలాడినా కనికరించలేదు
నా వయస్సు 80 ఏళ్లు. నా పిల్లలు, నా మనవళ్లు అందరూ ఇదే ఇంటిలో పుట్టి పెరిగారు. గ్రామంలో రాకపోకలకు నా ఇల్లు అడ్డుగా లేదు. కానీ ఇప్పుడు పాకలను తొలగించేశారు. ఎంత బతిమలాడినా వినలేదు.
– కర్రి పాపయ్య, గ్రామస్తుడు
నోటీసులు ఇచ్చాం
స్థానికంగా నివాసం ఉంటున్న వారంతా ప్రభు త్వ గోర్జితో పాటు చెరువు గర్భంలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు మాకు నివేదిక ఇచ్చారు. దీంతో మేము 17 మందికి నోటీసులను మూడు దఫాలుగా అందించాం.ఎవ్వరూ స్పందించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించాం. – బొడ్డేపల్లి శైలజ, ఎంపీడీఓ
కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
గ్రామానికి చెందిన టీడీపీ సర్పంచ్ కక్షపూరితంగా వ్యవ హరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులుగా ఉన్న మా నివాసాలను తొలగించారు. 50 ఏళ్లుగా ఉంటున్న మా నివాసంలో నా ఇంటి ప్రహరీని తొలగించారు.
– సిమ్మ అప్పన్న, వైఎస్సార్ సీపీ నాయకుడు
సర్పంచే చేశారు
టీడీపీ సర్పంచ్ అధికారుల ను ఉసిగొల్పి మా పాకలు తీయించేశారు. ఆయన గతంలో చెరువు గట్టు మీద గల తుమ్మచెట్టు, చీమ ఖర్జూరం చెట్లను గ్రామస్తులకు తెలీకుండా అమ్ముకున్నారు.
– బొగ్గు అప్పన్న, గ్రామస్తుడు
●
Comments
Please login to add a commentAdd a comment