తీగ లాగుతున్నారు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఎల్‌బీఎస్ నగర్‌లోని ఆర్మీ కాలింగ్ సెంటర్‌కు ఒకటో పట్టణ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. గొడవ జరుగుతుందని తమకు సమాచారం రావడంతో ఎస్పీ ఆదేశాలతో వెళ్లినట్లు ఎస్‌ఐ ఎం.హరికృష్ణ చెప్పారు. తమ వద్ద ఉన్న పెన్‌డ్రైవ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పోలీసులు అడగడంతో ఇచ్చామని అక్కడి విద్యార్థులు పేర్కొన్నారు. డేటా భద్రంగా ఉంచాలని, నేరుగా ఎస్పీకే అందజేయాలని విద్యా ర్థులు కోరినట్లు ఎస్‌ఐ చెప్పారు. ఈ సంస్థలో రూ.లక్షలు కట్టించుకుని ఉద్యోగాలు ఇవ్వలేదని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు ప్రస్తావించారు. రమణ ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు పరిశీలిస్తే అమ్మాయిలకు సంబంధించి వేధింపుల పర్వం బండారం బయటపడుతుందన్నారు. పోలీసులు, కొంతమంది మీడియా ప్రతినిధులు, ప్రముఖుల అండదండలు రమణకు మొదటి నుంచీ ఉండటంతో తాము డైరెక్టుగా కోర్టులోనే వీడియోలు, ఆధారాలు సబ్మిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బాధితులు చెప్పడం విశేషం. మంగళవారం కూడా రమణ మోసాలపై రూరల్ పోలీస్ స్టేషన్‌లోను, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.
కాలింగ్ సెంటర్ అకృత్యాలపై..
మంగళవారం జిల్లాకు విచ్చేసిన రెండు రాష్ట్రాల ఆర్మీ డిప్యూటీ జనరల్ కమాండింగ్ అధికారి బ్రిగేడియర్ ఎన్‌వీ నంజుదేశ్వర్ పలాస, శ్రీకాకుళం క్యాంటీన్లను సందర్శించారు. అనంతరం జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారిణిని ఆర్మీకాలింగ్ సెంటర్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన సెంటర్ ఆగడాలపై ఆమె నివేదిక ఇచ్చారు. ఈ సెంటర్‌లో పనిచేసి మానేసిన విజయనగరానికి చెందిన కీలక వ్యక్తిపై ఇప్పటికే అక్కడి మాజీ సైనిక సంఘం వివరాలు సేకరించే పనిలో పడ్డారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment