ఎల్‌ఎన్ పేట: జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు బుధవారం నాలుగో సారి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేశారు. తాజాగా విడుదల కానున్న ‘ఫారం–3ఎ’ షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీన సాగునీటి సంఘాలకు సంబంధించిన బహిరంగ ప్రకటనను అధికారులు చేస్తారు. ఈనెల 14వ తేదీ ఉదయం 8గంటల నుంచి టీసీ సభ్యుల (నీటి సంఘాల ప్రాదేశిక సభ్యుల) ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏకాభిప్రాయం, ఏకాభిప్రా యం లేనప్పుడు అనే రెండు పద్ధతుల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తారు. జిల్లాలో 344 మేజర్, మైనర్ సాగునీటి సంఘాలుగా విభజించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ పరిధిలో 54 సంఘాలు, కుడి ప్రధాన కాలువపై 18 సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇరిగేషన్ శాఖ పరిధిలో 250 మైన ర్, మరో 21 మేజర్ సాగునీటి సంఘాలకు ఈనెల 14వ తేదీన ఎన్నికలు జరగన్నాయి. వీటిలో 2,11, 429 మంది రైతులను ఓటర్లుగా గుర్తించారు. మేజర్ సాగునీటి సంఘాలకు 12 మంది టీసీ సభ్యులు, మై నర్ సాగునీటి సంఘాలకు ఆరుగురు టీసీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. టీసీ సభ్యులు సాగు నీటి సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. మేజర్ సాగునీటి సంఘాల్లో మొదటి ఆరు టీసీలు, కింద నుంచి ఆరు టీసీల్లో ఎవరో ఒకరిని అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment