శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా జూనియర్స్ బాలురు, బాలికల జట్ల ఎంపికలు ఈనెల 15వ తేదీన జరగనున్నాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ శ్రీకాకుళం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్ష,కార్యద ర్శులు నక్క కృష్ణారావు, సాదు ముసలినాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎంపికలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మొదలవుతాయని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు బాలురు 70 కేజీలు, బాలికలు 65 కేజీలలోపు బరువు ఉండాలని వారు స్పష్టంచేశారు. మరి న్ని వివరాలకు పీడీ సాదు శ్రీనివాస్ ( 9441914214)ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment