రైతుల సమస్యలపై పోరాటం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రైతులను అన్ని రకాలు గా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరుమాసాలైనా ఒక్క రూపా యి అందించకపోవడంపై రైతులు మండిపడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఇప్పటివరకు ఒక్క విడత కూడా రైతుభరోసా (అన్నదాత సుఖీభవ) డబ్బులు జమ చేయకపోవడం దారుణమన్నారు. రైతుల సమస్యలను ఎత్తి చూపేందుకు జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావుపూలే పార్కు (పొన్నాడ వంతెన) వద్ద ఈ నెల 13న ర్యాలీ, నిరసన కార్యక్రమం ఉదయం 10గంటలకు నిర్వహించనున్నామని కృష్ణదాస్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ సన్మాన సభలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ 27న విద్యుత్ చార్జీలపై, 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన చేస్తామన్నారు.ధాన్యం కొనుగోలులో దళారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కనీసం కూటమి ప్రభుత్వం చర్య లు తీసుకోకపోవడం దారుణమన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, దుంపల లక్ష్మణరావు, పిన్నింటి సాయి, అంబటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
13న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన
Comments
Please login to add a commentAdd a comment