● అమ్మకు బంగారు కిరీటం
జిల్లా కేంద్రంలోని ఫాజుల్‌బాగ్ పేటలో వేంచేసిన భద్రమహంకాళి అమ్మవారికి పలువురు భక్తులు బంగారు కిరీటం, బంగారు కర్ణాభరణాలను సమర్పించారు. బంగారు కిరీటాన్ని ఎన్‌ఆర్‌ఐ భక్తులు భద్రరావు దంపతు లు సమర్పించగా, బంగారు కర్ణాభరణాలను పలువురు భక్తుల సహకారంతో సమర్పించారు. అలాగే కిల్లంశెట్టి అరుణకుమార్ దంపతులు ఇత్తడి గణపతి విగ్రహాన్ని, సాతివిల్లి చంద్రమౌళి దంపతులు ఇత్తడి సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఆభరణా లు చేసిన శిల్పిని సత్కరించారు.
– శ్రీకాకుళం కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment