విజయసాయిరెడ్డిని కలిసిన జిల్లా నాయకులు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, రాజ్యసభ సభ్యు లు విజయసాయిరెడ్డిని విశాఖపట్నంలో ఆయన నివాసంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లా ముఖ్య నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారితో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కలసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారచు. కూటమి ప్రభుత్వం ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజయసాయిరెడ్డిని కలిసినవారిలో వైఎస్సార్‌సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మె ల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, పిరియా సాయిరాజ్, టెక్కలి, ఆమదాలవలస నియోజవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ, కళింగవైశ్యకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, గేదెల పురుషోత్తం, ఖండాపు గోవిందరావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment