శ్రీకాకుళం న్యూకాలనీ, జలుమూరు: విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన గురువులే పల్చనవుతుండటం సరికాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లాలోని జలుమూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జలుమూరు జూనియర్ కళాశాల ల ప్రాంగణంలో పనులు, చెట్ల నరికివేత పంచాయతీ మంగళవారం రాత్రి కలెక్టర్ వద్దకు చేరింది. డీవీఈఓ ఎస్.తవిటినాయుడు, డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జలుమూరు హెచ్‌ఎం, ప్రిన్సిపాల్‌తోపాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు హాజరయ్యారు. ఇరు విద్యాసంస్థల వాదనలు విన్న కలెక్టర్ హెచ్‌ఎం, ప్రిన్సిపాల్‌ను నెలరోజులపాటు సెలవు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడి వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ శివ్వాల తవిటినాయుడును నెలరోజుల్లో నివేదికను తన ముందుంచాలన్నారు. నివేదిక ఆధారంగా కచ్చితంగా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment