● పెరుగుతున్న సైబర్ నేరాలు ● వెలుగులోకి రోజుకొక సరికొత
ఎలా చేస్తారంటే..
సైబర్ కేటుగాళ్లు అమ్మాయి పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ (ఇతర యాప్స్) ఐడీని క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకున్న వ్యక్తికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. యాక్సెప్ట్ చేయగానే ముందుగా చాటింగ్.. అలా నంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం.. ఆ తర్వాత వాట్సాప్‌లో వ్యక్తిగత సమాచారం (వ్యక్తిది) తెలుసుకుని అడల్ట్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునేవరకు కథ తీసుకెళ్తారు. అనంతరం చాట్ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగి అవతలివైపు నుంచి రికార్డ్ చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్‌లో లైవ్‌లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్‌చాట్‌లోకి తీసుకొస్తారు. వెంటనే మొత్తం కాల్ రికార్డ్ చేసి అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియోను షేర్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు.
అందమైన వల..
చిక్కారో విలవిల
మనుషులను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసే పద్ధతి ఎక్స్‌టార్సన్. అలాగే అందమైన అమ్మాయిలను ఎరవేసి, తర్వాత బెదిరించి డబ్బులు దోచుకోవడం సెక్స్‌టార్సన్. వాట్సాప్, ఫేస్‌బుక్, టిండర్ (డేటింగ్ యాప్), ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా మనలో ఉండే బలహీనతలను క్యాష్ చేసుకుని సైబర్ నేరగాళ్లు సెక్స్‌టార్సన్ పద్ధతిలో మోసాలు చేస్తుంటారు. వీరు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి నెట్‌వర్క్ నడుపుతున్నట్లు దర్యాప్తు విభాగాలు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పుడు ఈ మోసాలే ట్రెండీగా నడుస్తున్నాయి. సంపన్న వర్గాలకు చెందిన వృద్ధులు, యువత అధికంగా ఈ మాయలో పడుతుండటం విశేషం. వీరితో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయవేత్తలు సైతం జిల్లాలో వందల సంఖ్యలో మోసపోతున్నారు.
జాగ్రత్తగా ఉండాలి
ఏ బ్యాంకు కూడా ఆన్‌లైన్ కేవైసీ వివరాలు అడగదు. అపరిచితులు పంపే లింక్‌లు ఓపెన్ చేయరాదు. వాళ్లు మన ఫోన్‌ను హ్యాక్ చేసే సమయంలో మన అకౌంట్‌లో డబ్బులు ఎంత ఉంటే అంత మాయం చేస్తారు. డబ్బులు లేకపోతే ఏమీ చేయలేరు. ఎప్పటికప్పుడు మన ఖాతాను పరిశీలిస్తుండాలి. సెక్స్‌టార్షన్‌కు గురయ్యేవారు తామేదో తప్పు చేసినట్లు భావించి భయపడి పరువు సమస్యతో ఫిర్యాదు చేయకపోతే సైబర్ నేరగాళ్లకు మీరే బలమైన ఆయుధాన్ని ఇచ్చిన వారవుతారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే ఆపద నుంచి బయటపడవచ్చు.
– కేవీ మహేశ్వరరెడ్డి,
ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment