పారదర్శకంగా కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
● అభ్యర్థులు దళారులను నమ్మవద్దు
● 30 నుంచి ఎచ్చెర్ల మైదానంలో పీఎంటీ, పీఈటీ టెస్టులు
● ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పరిధిలో స్టైఫెండరీ సివిల్ పోలీస్ కానిస్టేబుల్ (పురుషులు, మహిళలు), ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల (పురుషులు) ఉద్యోగాలకు సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు పారదర్శకంగా జరగనున్నాయని, దళారుల మాట నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఎంపికై న అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లు ఎచ్చెర్లలో ఉన్న జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు కార్యాలయం పరేడ్ మైదానంలో ఈ నెల 30 నుంచి జనవరి 18 వరకు జరగనున్నాయని ఎస్పీ తెలిపా రు. ఈ మేరకు గురువారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి వి ధి విధానాలు, పాటించాల్సిన నియమాలు, జాగ్రత్త లు, బందోబస్తు వంటి అంశాలపై అధికారులు, సిబ్బందితో ఎస్పీ గురువారం సమీక్షించారు.
పోటీలో 7390 మంది అభ్యర్థులు..
జిల్లాలో 7390 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 6215 మంది పురుషులు, 1175 మంది మహిళలు పాల్గొంటారని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడమే కాక సీసీ కెమెరాలు, వైద్యసదుపాయాల కల్పనలో భాగంగా అంబులెన్సులు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
అభ్యర్థులు పాటించాల్సినవి..
● అభ్యర్థులు కాల్‌లెటర్‌లో తెలిపిన తేదీ, నిర్ణీత సమయానికి హాజరుకావాలి. లేదంటే అనుమతించరు.
● అభ్యర్థులు తమతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిడెట్ అధికారితో అటెస్ట్ చేయించిన జిరాక్స్ పత్రాలు ఒక సెట్టు తీసుకురావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో రాకుంటే అభ్యర్థిత్వం తిరస్కరిస్తారు.
● కాల్ లెటర్‌లో తెలిపిన స్కోర్ కార్డు (ఒరిజినల్ రిజల్ట్), స్టేజ్–1 అప్లికేషన్, స్టేజ్–2 అప్లికేషన్లు తప్పనిసరిగా తీసుకురావాలి.
● పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వెరిఫికేషన్ సమయంలో వాటి వివరాలను అధికారులకు తెలియపరచాలి.
దళారులను నమ్మవద్దు
ఏపీఎస్‌పీఆర్‌బీ వారితో నిర్వహించనున్న ఈ దేహదారుఢ్య పరీక్షలు నోటిఫికేషన్ అనుసరించి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతాయని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బులడిగే వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని ఎస్పీ హెచ్చరించారు. అలాంటివారు తారసపడితే తక్షణమే సమాచారాన్ని 6309990800, 6309990911 ఫోన్ నంబర్లకు డయల్ చేసి చెప్పాలన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీలు ఎం.అప్పారావు, డీఎస్‌ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి, ఏవో సిహెచ్ గోపినాధ్, సీఐ ఎం.అవతారం, ఆర్‌ఐ నర్సింగరావు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment