కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని శ్యామసుందరాపురం సమీపంలో జగతిమెట్ట సర్వీస్ రోడ్డుపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నౌపడ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్, టెక్కలి తెలుగుదేశం పార్టీ నాయకుడు మల్ల బాలకృష్ణ తన డ్రైవర్ ఎం.రామకృష్ణతో కలిసి శ్రీకాకుళం వైపు కారులో బయలుదేరారు. జగతిమెట్ట వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌కు మూర్చ వ్యాధి రావడంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి ముందుగా సైకిల్‌పై వెళ్తున్న ఎన్టీఆర్ కాలనీకి చెందిన తాపీమేస్త్రి హనుమంతు సింహాచలంను ఢీకొట్టారు. అనంతరం సర్వీస్ రోడ్డుపై ఉన్న కాలువపైకి కారు దూసుకెళ్లడంతో ఎదురుగా బైక్‌పై వస్తున్న అక్కవరం గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్‌ను కూడా ఢీకొట్టారు. ఈ ఘటనలో తాపిమేస్త్రికి తీవ్ర గాయాలు కాగా, గోపాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మూర్ఛవ్యాధికి గురైన డ్రైవర్‌ను కిందకు దించిన అనంతరం హైవే అంబులెన్స్‌లో ముగ్గురిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సింహాచలంను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘనపై టెక్కలి పోలీసులు కేసునమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment